నిన్న ప్రమాణ స్వీకారం.. నేడు లాక్‌డౌన్
Complete lockdown for two weeks from monday in tamilnadu.కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా
By తోట వంశీ కుమార్ Published on 8 May 2021 4:49 AM GMTకరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఈ మహమ్మారి కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించగా.. మరికొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను విధిస్తున్నారు. తాజాగా ఆ బాటలో తమిళనాడు రాష్ట్రం చేరింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన ఉదయం 4 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 4 గంటల వరకు అమలులో ఉంటుందని వెల్లడించింది.
నిత్యావసరాలపై ఎలాంటి ఆంక్షలు లేవని, మాంసం, కూరగాయల దుకాణాలు మధ్యాహ్నాం 12 గంటల వరకే తెరుచుకోవాలని చెప్పింది. మద్యం షాపులకు ఎలాంటి అనుమతి లేదని, రెస్టారెంట్లలో పార్శిల్ సదుపాయం మాత్రమే ఉంటుందని తెలిపింది. పెట్రోల్ బంక్‌లు తెలిచే ఉంటాయని పేర్కొంది. కాగా.. తమిళనాడు సీఎంగా స్టాలిన్ శుక్రవారమే ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్ణయించారు. కరోనా కట్టడికి లాక్‌డౌనే పరిష్కార మార్గంగా బావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇక శుక్రవారం ఒకే రోజు తమిళనాడు రాష్ట్రంలో 26,465 కొత్త కేసులు నమోదు కాగా.. 197 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య 13.23 లక్షలకు చేరగా.. మరణాల సంఖ్య 15,171కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.