కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కమర్షియల్ ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను 7 రూపాయాలు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1797కు తగ్గింది. తగ్గిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు రాలేదని చమురు సంస్థలు వెల్లడించాయి.
కమర్షియల్ సిలిండర్లను ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభం అయ్యాయి. నేడు పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించడం గమనార్హం. కాగా ప్రతి నెలా మొదటి తేదీన గ్లోబల్ క్రూడ్ ఆయిల్ రేట్లలో మార్పులు, ఇతర అంశాల ఆధారంగా చమురు కంపెనీలు ఎల్‌పిజి ధరలను క్రమం తప్పకుండా సవరిస్తాయి. అయితే తాజా సవరణలో గృహ వంట కోసం ఉపయోగించే గృహ LPG సిలిండర్ల ధరలు మారలేదు.