10 రోజుల వ్య‌వ‌ధిలో రెండోసారి పెరిగిన సీఎన్‌జీ ధ‌ర

CNG Piped Natural Gas prices hiked in Delhi.గృహ‌, ర‌వాణాకు వాడే గ్యాస్ ధ‌ర‌ల‌ను ప‌ది రోజుల వ్య‌వ‌ధిలో రెండో సారి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Oct 2021 8:35 AM GMT
10 రోజుల వ్య‌వ‌ధిలో రెండోసారి పెరిగిన సీఎన్‌జీ ధ‌ర

గృహ‌, ర‌వాణాకు వాడే గ్యాస్ ధ‌ర‌ల‌ను ప‌ది రోజుల వ్య‌వ‌ధిలో రెండో సారి పెంచేశారు. ఢిల్లీ, దాని చుట్టు ప‌క్క‌ల న‌గ‌రాల్లో వాహ‌నాల్లో నింపే సీఎన్‌జీ( కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) తో పాటు ఇళ్ల‌కు పైపు ద్వారా చేరే గ్యాస్ పైప్డ్ నాచురల్ గ్యాస్(పీఎన్‌జీ) ధ‌ర పెరిగింది. సీఎన్‌జీ ధర కిలోకు రూ. 2.28, పీఎన్‌జీ పై క్యూబిక్ మీటరుకు రూ.2.10 పెంచిన‌ట్లు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వెల్ల‌డించింది. పెరిగిన ధ‌ర నేటి నుంచి అమ‌ల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తాజా పెంపుతో ఢిల్లీలో సీఎన్‌జీ ధర ఇప్పుడు కిలో రూ. 49.76 గా ఉంది. పీఎన్‌జి ధర కిలో రూ. 35.11కి చేరింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో సీఎన్‌జి ధర కిలోకు రూ. 56.02 కాగా, పీఎన్‌జి ధర రూ .34.86 కు లభిస్తోంది. 2012 తర్వాత సీఎన్‌జీ ధరలలో ఇదే అత్యధిక పెరుగుదల.

వివిధ న‌గ‌రాల్లో రేట్లు ఇలా..

- గురుగ్రామ్‌లో సీఎన్‌జీ కిలోకు రూ.58.20కాగా, పీఎన్‌జీ రూ.33.31కి దొరుకుతుంది. రేవరీలో సీఎన్‌జీ కిలోకు రూ.58.90, కర్నాల్, కైతాల్‌లో కిలోకు రూ. 57.10 కి అమ్ముతున్నారు. ఇక రేవారి, కర్నాల్‌లో పీఎన్జీ రూ. 33.92గా ఉంది.

- ముజఫర్‌నగర్, మీరట్, షామ్లీలలో సీఎన్ జీ ధర కిలోకు రూ. 63.28కాగా, పీఎన్ జీ ధర ఎస్ సీఎమ్ కి. రూ. 38.37 కి విక్రయించబడుతుంది.

- కాన్పూర్, ఫతేపూర్, హమీర్‌పూర్‌లో కిలో సీఎన్ జీ రూ. 66.54 గా న‌మోదైంది.

- అజ్మీర్, పాలి, రాజ్‌సమంద్‌లో సీఎన్ జీ ధర కిలోకు రూ. 65.02గా ఉంది.

Next Story