ఆ పరీక్షకు వ్యతిరేకంగా పోరాడాలని.. 12 రాష్ట్రాల సీఎంలకు లేఖ..!
CM Stalin letter to 12 states Chief ministers over NEET exam.తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. మెడికల్ ఎంట్రన్స్
By అంజి Published on 5 Oct 2021 10:10 AM ISTతమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (నీట్)కు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని కోరుతూ 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. లేఖలో విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యత మెరుగుపడాలన్నారు. నీట్ పరీక్ష వివక్షతో కూడుకున్నదని, ఆర్థికంగా బలహీన వర్గాలను ప్రభావితం చేస్తుందని గత నెలలో ఏకే రాజన్ కమిటీ వెల్లడించిన వివరాలను లేఖలో జతపర్చారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర , ఒడిశా, పంజాబ, రాజస్థాన్, తెలంగాన, వెస్ట్ బెంగాల్, గోవా ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. ఎన్‌డీయేతర రాష్ట్ర సీఎంలకు మాత్రమే సీఎం స్టాలిన్ లేఖ రాశారు. ఆర్థికంగా బలహీన వర్గాల నుండి వచ్చే విద్యార్థులు ఉన్నతవిద్యాసంస్థల్లో చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన రాష్ట్రాలు చూసుకోవాలన్నారు.
ఇదే విషయయమై 12 రాష్ట్రాల సీఎంలని డీఎంకే ఎంపీలు కలిసి మద్దతు కూడగట్టాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఏకే రాజన్ కమిటీ నివేదిక ప్రకారం.. "కేంద్రీకృత వైద్య పరీక్షలు కొనసాగితే, ప్రభుత్వ ఆస్పత్రులలో తగినంతమంది నిపుణులైన వైద్యులు నియమించబడకపోవచ్చు. ఆరోగ్యం సంరక్షణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఇది సంపన్న, విద్యావంతుల కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది." కమిటీ నివేదిక ఆధారంగానే నీట్ నుండి తమిళనాడును మినహాయించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపింది.