కేజ్రీవాల్, సిసోడియా, కవితల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ నాయ‌కురాలు క‌ల్వ‌కుంట్ల‌ కవితల జ్యుడీషియల్ కస్టడీని బుధవారం కోర్టు పొడిగించింది

By Medi Samrat  Published on  31 July 2024 3:01 PM IST
కేజ్రీవాల్, సిసోడియా, కవితల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ నాయ‌కురాలు క‌ల్వ‌కుంట్ల‌ కవితల జ్యుడీషియల్ కస్టడీని బుధవారం కోర్టు పొడిగించింది. నేటితో ఈ ముగ్గురి జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వారిని తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. సీబీఐ కేసులో ఆగస్టు 9 వరకూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఆగస్టు 13 వరకూ రోస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ ముగ్గురి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు.

సీబీఐ దాఖలు చేసిన అవినీతి కేసుకు సంబంధించి సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. అదే రోజు ముందుగా ఆప్‌ అధినేతతో పాటు ఇతర నిందితులపై సీబీఐ తన చార్జిషీటును ఇక్కడి ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. మనీలాండరింగ్ కేసులో ED ఇప్పటికే తన చార్జిషీటును దాఖలు చేసింది. అందులో AAP, అరవింద్ కేజ్రీవాల్‌ను నిందితులుగా పేర్కొంది.

ఈడీ కేసుకు సంబంధించి సీఎం కేజ్రీవాల్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని జూలై 12న సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సీబీఐ అరెస్టు నేప‌థ్యంలో ఆయన జైలు నుంచి బయటకు రాలేకపోయారు.

Next Story