సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ భేటీ

CM KCR met Akhilesh yadav discussed on national politics. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను

By అంజి
Published on : 29 July 2022 4:45 PM IST

సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ భేటీ

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత జాతీయ రాజకీయాలపై చర్చ జరిగింది. సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు, వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చలో అఖిలేష్ యాదవ్‌తో పాటు ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ కూడా ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ రానున్నారు.

అంతకుముందు ఢిల్లీ పర్యటనలో ఆయన పలువురు రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులను కలిశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులను కలుస్తారనే ప్రచారం సాగింది. కానీ.. ఆయన ఎవరినీ కలవకుండానే హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది.

Next Story