వెక్కి వెక్కి ఏడ్చేన సీఎం.. ఎందుకంటే..?

CM Bommai gets teary eyed after watching 777 Charlie.మ‌నిషికి భావోద్వేగాలు స‌హ‌జం. అయితే.. చాలా మంది వాటిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2022 3:34 PM IST
వెక్కి వెక్కి ఏడ్చేన సీఎం.. ఎందుకంటే..?

మ‌నిషికి భావోద్వేగాలు స‌హ‌జం. అయితే.. చాలా మంది వాటిని నియంత్రించుకుంటూ ఉంటారు. అంద‌రిలో ఉన్న‌ప్పుడు దాదాపుగా బ‌య‌ట‌పెట్ట‌రు. మ‌రీ ముఖ్యంగా అధికారంలో ఉన్న నాయ‌కులైతే మ‌రీను. అయితే.. క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై చిన్న‌పిల్లాడిలా ఏడ్చేశారు. అది కూడా ఓ సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మీది చిన్న పిల్లాడి మ‌న‌స్థ‌త్వం సార్ అంటూ నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. రక్షిత్‌ శెట్టి ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన '777 ఛార్లీ' సినిమాను ఇటీవ‌ల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై చూశారు. దర్శకుడు కిరణ్‌రాజ్‌.. మనిషికి, పెంపుడు కుక్క మధ్య ఉన్న బాండింగ్‌ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని చూస్తూ ముఖ్య‌మంత్రి ఒక్క‌సారిగా భావోద్వేగానికి లోన‌య్యారు. త‌న పెంపుడు కుక్క స్నూబీ గుర్తుకు రావ‌డ‌మే అందుకు కార‌ణం. గతేడాది స్నూబీ చ‌నిపోయింది. బొమ్మై సీఎం ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డానికి కొన్ని రోజుల ముందు ఆ శున‌కం మ‌ర‌ణించింది. దాని అంత్యక్రియల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చారాయన.

సినిమా చూసిన అనంత‌రం బొమ్మై మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని అంద‌రూ చూడాల‌ని అన్నారు. గ‌తంలో కుక్క‌ల‌పై చాలా చిత్రాలు వ‌చ్చాయ‌ని, అయితే.. ఈ చిత్రంలో భావోద్వేగాలతో చూపించారన్నారు. కుక్క‌లు క‌ళ్ల‌తోనే త‌మ భావోద్వేగాల‌ను వ్య‌క్తప‌రుస్తాయ‌ని, చిత్రం బాగుంద‌న్నారు. అన్ కండిష‌న‌ల్ ల‌వ్ ఉండాల‌ని, శున‌కాకు ప్రేమి అప‌రిమితంగా ఉంటుంద‌ని సీఎం అన్నారు.

Next Story