Ayodhya: రామ మందిరంలో కాంగ్రెస్ కార్యకర్తలు, భక్తుల మధ్య ఘర్షణ

అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరానికి మెగాభిషేక మహోత్సవానికి ముందు వచ్చిన భక్తులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

By అంజి  Published on  16 Jan 2024 3:14 AM GMT
Congress workers, devotees, Ram Mandir, Ayodhya

Ayodhya: రామ మందిరంలో కాంగ్రెస్ కార్యకర్తలు, భక్తుల మధ్య ఘర్షణ

అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరానికి మెగాభిషేక మహోత్సవానికి ముందు వచ్చిన భక్తులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రామమందిరం ప్రవేశ ద్వారం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు, భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఆలయ ప్రాంగణం వెలుపల కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండాలను ఎగురవేసి భక్తులను రెచ్చగొట్టడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యకర్తలు పుణ్యక్షేత్రంలోకి ప్రవేశిస్తున్న సమయంలో కొందరు భక్తులు కాంగ్రెస్ జెండాను లాక్కొని చించేశారు.

వైరల్ వీడియోలో.. వాగ్వాదం సమయంలో భక్తులు "జై శ్రీ రామ్" నినాదాలు చేయడం వినబడింది. ఈ ఘటనపై కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జి అవినాష్ పాండే స్పందిస్తూ.. మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి గొడవలు సృష్టించాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి అల్లకల్లోలం సృష్టించాలని కొందరు భావించడాన్ని తాము ఖండిస్తున్నామని, వాళ్లు కొందరు బుద్ధిహీనులు కావొచ్చు. ప్రార్థనలు చేయడానికి వచ్చామని, దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని పాండే అన్నారు

ఇదిలా ఉండగా, దీపేందర్ హుడా, అవినాష్ పాండే, సుప్రియా శ్రీనాథ్, అజయ్ రాయ్‌తో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు రామ్ లల్లాను దర్శించుకోవడానికి, సరయూ నదిలో పుణ్యస్నానం చేయడానికి సోమవారం అయోధ్యకు చేరుకున్నారు. పవిత్ర నగరం అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయంలో కూడా నాయకులు ప్రార్థనలు చేశారు.

జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలన్న ఆహ్వానాన్ని "గౌరవపూర్వకంగా తిరస్కరించాలని" కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించిన తర్వాత కాంగ్రెస్ దాడులకు కేంద్రబిందువైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభలో ఆ పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఈ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించారు. మతం అనేది "వ్యక్తిగత విషయం" అని పేర్కొంటూ, ఎన్నికల ప్రయోజనాల కోసం బిజెపి దీనిని "రాజకీయ ప్రాజెక్ట్"గా మార్చిందని పాత పార్టీ ఆరోపించింది.

Next Story