ఉగ్ర కలకలం.. వేర్వేరు చోట్ల కాల్పులు.. ఒక‌రి మృతి

Civilian killed in suspected terror attack.జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, పౌరు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Oct 2021 5:17 AM GMT
ఉగ్ర కలకలం.. వేర్వేరు చోట్ల కాల్పులు.. ఒక‌రి మృతి

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, పౌరులే ల‌క్ష్యంగా ఉగ్ర‌వాదులు త‌ర‌చుగా దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. శ్రీన‌గ‌ర్‌లోలో వేర్వేరు చోట్ల ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. ఈ దాడుల్లో ఓ పౌరుడు మృతి చెంద‌గా.. మ‌రొక‌రి తీవ్ర‌గాయాలు అయ్యాయి. శ‌నివారం సాయంత్రం 5.50 గంట‌ల ప్రాంతంలో కారాన‌గ‌ర్ ప్రాంతంలో ఉగ్ర‌వాదుల కాల్పులకు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ‌గా.. అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించగా.. అప్ప‌టికే అత‌డు చ‌నిపోయిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో ఉగ్ర‌వాదుల కోసం గాలింపు చేప‌ట్టారు. ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా... రాత్రి 8 గంట‌ల ప్రాంతంలో మ‌రో చోట కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ష‌పీ దార్ అనే వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. అత‌డిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ రెండు చోట్ల కాల్పుల‌కు పాల్ప‌డిన వారి కోసం పోలీసులు ముమ్మ‌రంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Next Story
Share it