బోర్డర్ లో ఉద్రిక్తల నడుమ 10 ఆకాష్ మిసైల్స్ ను టెస్ట్ చేసిన భారత ఎయిర్ ఫోర్స్

China border conflict, IAF testfires 10 Akash missiles to ‘shoot down’ enemy fighters I.. భారత్-చైనా దేశాల మధ్య లైన్ ఆఫ్

By సుభాష్  Published on  9 Dec 2020 8:29 AM IST
బోర్డర్ లో ఉద్రిక్తల నడుమ 10 ఆకాష్ మిసైల్స్ ను టెస్ట్ చేసిన భారత ఎయిర్ ఫోర్స్

భారత్-చైనా దేశాల మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్.ఏ.సీ.) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసింది. చైనీస్ ఎయిర్ ఫోర్స్ కూడా తోక జాడించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ను భారత ఎయిర్ ఫోర్స్ పరీక్షించింది. మొత్తం 10 మిసైల్స్ ను భారత్ ఎయిర్ ఫోర్స్ పరీక్షించింది. శత్రుదేశాల నుండి ఎటువంటి విమానం వచ్చినా ఈ మిసైల్స్ వాటిని కూల్చేయగలవు. ఆంధ్రప్రదేశ్ లోని సూర్య లంక టెస్ట్ ఫైరింగ్ రేంజిలో ఈ పరీక్షలను నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలను ఈ మిసైల్స్ ఛేదించాయి.

'కంబైన్డ్ గైడెడ్ వెపన్స్ ఫైరింగ్ 2020 ఎక్సర్సైజ్ లో భాగంగా 10 ఆకాష్ మిసైల్స్ ను భారత ఎయిర్ ఫోర్స్ ప్రయోగించింది. శత్రువుల విమానాలను కూల్చడానికి ఈ మిసైల్స్ ను రూపొందించారు. ఈ మిసైల్స్ టార్గెట్ ను డైరెక్ట్ గా హిట్ చేశాయి' అని ప్రభుత్వ విభాగాలు మీడియాకు తెలిపాయి. ఆకాష్ మిసైల్స్ తో పాటూ ఇగ్లా షోల్డర్ ఫర్డ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయోగించింది. వీటిని ఇప్పటికి ఎల్.ఏ.సీ. దగ్గర లోని తూర్పు లడఖ్ ప్రాంతం లోనూ, మరికొన్ని సెక్టార్స్ లోని ఉంచారు. భారత గగనతలం లోకి వచ్చే విమానాలను ఈ మిసైల్స్ కూల్చివేయగలవు. డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డి.ఆర్.డి.ఓ.) ఆకాష్ ప్రైమ్ మిసైల్స్ సిస్టమ్ మీద పని చేస్తూ ఉంది. ఎక్కువ ఎత్తులో వెళుతున్న విమానాలను కూల్చే విధంగా ఈ మిసైల్స్ ను డి.ఆర్.డి.ఓ. రూపొందించింది. చైనీస్ ఆర్మీ సరిహద్దుల్లో జె-20 ఫిఫ్త్ జెనరేషన్ ఫైటర్ జెట్స్ ను ఉంచగా.. వాటిని కూడా ఈ మిసైల్స్ చేధించగలవు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం క్యాబినెట్ కమిటీ 5500 కోట్ల రూపాయలను ఇటీవలే కేటాయించింది. పాకిస్థాన్, చైనా బోర్డర్లలో పెద్ద ఎత్తున ఆయుధ సంపత్తిని భారత దళాలకు అందించనున్నారు.

Next Story