ఛత్తీస్‌గడ్ సీఎం భూపేష్ బాఘెల్ మంగళవారం కొరడా దెబ్బలు తిన్నారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి కొరటా దెబ్బలు తినడం ఏంటీ..? అని మీరు అనుకుంటున్నారా..? అవును మీరు చదివింది నిజమే..? ఆచారంలో భాగంగా ఆయన కొరడా దెబ్బలు తిన్నారు.
దీపావళి వేడుకలు ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో సోమవారం ఘనంగా జరిగాయి. దుర్గ్ జిల్లాలోని జజన్‌గరి గ్రామంలో మంగళవారం ఉదయం గోవర్ధన్ పూజ జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ పాల్గొన్నారు. గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఆ తరువాత అక్కడి తంతులో భాగంగా మిగతా భక్తుల లాగే సీఎం కూడా కొరడా దెబ్బలు తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాగా.. ఇలా కొరడాదెబ్బలు తినడం వల్ల శుభం కలుగుతుందని స్థానికుల నమ్మకం. ఈ నమ్మకాన్ని, ఆచారాన్ని ముఖ్యమంత్రి బాఘెల్ కూడా పాటిస్తారు. ఏటా దీపావళి తర్వాతి రోజు జరిగే గోవర్ధన్ పూజలో పాల్గొంటారు.