కూతురి ఆరోగ్యంపై వైద్యుల తప్పుడు నిర్ధారణ.. అసెంబ్లీ ముందు పోలీసు అధికారి నిరసన
తమిళనాడులోని చెన్నైలో ఒక పోలీసు అధికారి తన 10 ఏళ్ల కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం
By అంజి Published on 14 April 2023 1:36 AM GMTకూతురి ఆరోగ్యంపై వైద్యుల తప్పుడు నిర్ధారణ.. అసెంబ్లీ ముందు పోలీసు అధికారి నిరసన
తమిళనాడులోని చెన్నైలో ఒక పోలీసు అధికారి తన 10 ఏళ్ల కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తన సర్వీస్ యూనిఫాం ధరించి అసెంబ్లీ వెలుపల నిరసనకు దిగాడు. ఎగ్మోర్ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పోలీసు అధికారి గోదాండరామన్ ఆరోపించారు. అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. గత ఐదేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కుమార్తె ఎగ్మోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 2021లో హాస్పిటల్‌లో వైద్యులు ఇచ్చిన ఔషధం యొక్క దుష్ప్రభావాల కారణంగా తన కుమార్తె కుడి పాదానికి ఇన్ఫెక్షన్ వచ్చిందని గోధండరామ పేర్కొన్నారు.
చికిత్స తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు, అయితే ఇన్‌ఫెక్షన్ వ్యాపించి, అక్టోబర్ 20, 2021న ఆమెను ఐసీయూలో చేర్చారు. వైద్యులు తప్పుడు రోగనిర్ధారణ చేశారని, ఆ తర్వాత రక్తపు ఇన్ఫెక్షన్ వచ్చిందని గోధండరామన్ ఆరోపించారు. వైద్యులు తమ తప్పును దాచిపెట్టడానికి తల్లిదండ్రుల అనుమతి లేకుండా రక్త డయాలసిస్ చేశారని ఆయన పేర్కొన్నారు. డయాలసిస్ తర్వాత, తన కుమార్తెకు మూర్ఛ వ్యాధి సోకిందని, అయితే వైద్యులు ఆమెకు కాల్షియం లోపం ఉందని మళ్లీ తప్పుగా నిర్ధారించారని ఆయన చెప్పారు.
అతను తన కుమార్తెకు మెదడువాపు వ్యాధికి మందు ఇచ్చారని, ఆమె కోమాకు దారితీసిందని, అనేక తప్పు నిర్ధారణల కారణంగా ఆమె పాదం పాక్షికంగా కత్తిరించబడిందని అతను పేర్కొన్నాడు. ''మూడు సార్లు నా కుమార్తె వైద్య పరిస్థితి తప్పుగా నిర్ధారణ అయింది. నేను ఒక పిటిషన్ పంపాను. ఎగ్మోర్ ఆసుపత్రి డీన్‌ని విచారించాను. కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు'' అని గోదాండరామన్ అన్నారు. సీబీ-సీఐడీ విచారణ, ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఫిర్యాదుపై ఇప్పటి వరకు సంబంధిత పోలీసు అధికారులు తనకు సీఎస్‌ఆర్ కాపీని ఇవ్వలేదని అధికారి ఆరోపించారు.