బీజేపీ దొంగిలించింది.. కానీ తిరిగి మేం గెలిచాం: కేజ్రీవాల్

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.

By Srikanth Gundamalla  Published on  20 Feb 2024 3:00 PM GMT
chandigarh, mayor, aap, supreme court,

బీజేపీ దొంగిలించింది.. కానీ తిరిగి మేం గెలిచాం: కేజ్రీవాల్ 

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. గత నెలలో జరిగిన చండీగఢ్‌ మేయర్ ఎన్నికల ఫలితాలు చల్లవని చెప్పిన సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలను జారీ చేసింది. రిటర్నింగ్‌ అధికారి చట్ట విరుద్దంగా వ్యవహరించారని వ్యాఖ్యానించింది. ఆప్‌ కౌన్సిలర్‌ కుల్దీప్ కుమార్‌ను చండీగఢ్‌ మేయర్‌గా ప్రకటించింది అత్యున్నత న్యాయస్థానం. మంగళవారం సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించగా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ స్వాగతించారు.

సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కఠిన సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిన దేశ అత్యున్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తమకు ఎదురే లేదని ఎన్డీఏ కూటమి మాటలు చెబుతోందన్నారు. కానీ.. ఈ విజయం ఎన్డీఏ కూటమిపై ఇండియా కూటమి సాధించిన తొలి విజయమని అన్నారు. అయితే.. చండీగఢ్‌ మేయర్ ఎన్నికల్లో బీజేపీ నిరంకుశత్వంతో దొడ్డిదారిలో గెలుపొందాలని ప్రయత్నించిందంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చండీగఢ్‌ మేయర్ ఎన్నికల్లో ముందుగా బీజేపీ దొంగమార్గంలో గెలిచిందని చెప్పారు కేజ్రీవాల్. కానీ.. ఆ తర్వాత తిరిగి తాము గెలిచి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నామని చెప్పారు. ఇది ఇండియా కూటమికి అతిపెద్ద విజయమని చెప్పారు. బీజేపీని ఓడించలేమని చెప్పారనీ.. ఇకనైన మేం మిమ్మల్ని ఓడిస్ఆమని ఈ విషయం తెలుసుకోవాలని ఎన్డీఏ కూటమికి కేజ్రీవాల్ సూచించారు. ఇండియా కూటమి భాగస్వామ్య నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మేయర్‌ పీఠం గెలవడం చండీగఢ్‌ ప్రజల విజయం అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.


Next Story