వ్యాక్సిన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్న కేంద్రం

Center may waive GST on vaccines.కరోనా వ్యాక్సిన్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2021 9:45 AM GMT
GST on Vaccines

కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. కరోనా వ్యాక్సిన్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అలా చేస్తే ఒక్కో వ్యాక్సిన్ డోసు ధర తగ్గనుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇస్తూ ఉండగా.. ప్రజలంతా వ్యాక్సినేషన్ లో చురుగ్గా పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జీఎస్టీ తగ్గింపుతో వ్యాక్సిన్ ధర తగ్గుతుందని, దాని వల్ల ప్రైవేటులో ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఇప్పటికే కరోనా ఔషధ ముడిసరుకులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. అదే రీతిలో కరోనా వ్యాక్సిన్లపై ఉన్న 5 శాతం జీఎస్టీనీ రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వ్యాక్సిన్లపై జీఎస్టీ రద్దును జీఎస్టీ మండలి ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో మండలిలోని సభ్యులెవరూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోవచ్చని చెబుతూ ఉన్నారు. ఇటీవలే కొవిషీల్డ్, కొవాగ్జిన్ ధరలను ఆయా టీకాల తయారీ సంస్థలు ప్రకటించాయి. కొవిషీల్డ్ ను రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600కు ఇస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రకటిస్తే.. ఆ మరుసటి రోజే కొవాగ్జిన్ ను రాస్ట్రాలకు రూ.600, ప్రైవేటుకు రూ.1,200కు ఇస్తామని ప్రకటించింది. సీరం దిగివచ్చి రాష్ట్రాలకు రూ.300కే ఇస్తామని తెలిపింది. దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఉన్న సంగతి తెలిసిందే..!


Next Story