మ‌ద్రాస్ హైకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా శ్రీశ్రీ కుమారై

Centre Appoints Two New Additional Judges To Madras High Court.మ‌ద్రాస్ హైకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా సుప్రసిద్ధ

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 25 March 2022 5:35 AM

మ‌ద్రాస్ హైకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా శ్రీశ్రీ కుమారై

మ‌ద్రాస్ హైకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా సుప్రసిద్ధ రచయిత శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) కుమార్తె నిడుమోలు మాలా నియ‌మితుల‌య్యారు. మ‌ద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలిజీయం ఆరుగురి పేర్ల‌ను సిఫార‌సు చేసింది. వీరిలో మాలా, ఎస్‌.సౌంద‌ర్‌ల పేర్ల‌కు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద‌ముద్ర వేశారు. ఈ క్ర‌మంలో మాలాను అద‌న‌పు న్యాయ‌మూర్తిగా నియ‌మిస్తూ.. కేంద్ర న్యాయశాఖ అదనపు కార్యదర్శి రాజేందర్‌ కశ్యప్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

శ్రీశ్రీ-సరోజా దంపతులకు న‌లుగురు సంతానం. వారిలో మాలా అంద‌రికంటే చిన్న‌వారు. మ‌ద్రాస్ లా కాలేజీ నుంచి ఆమె న్యాయ‌శాస్త్రంలో డిగ్రీ పొందారు. 1989లో మద్రాస్-పుదుచ్చేరి బార్ అసోసియేషన్ లో నమోదయ్యారు. 2020 నుంచి పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాలా భ‌ర్త నిడుమోలు రాధారమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు. మాలా-రాధారమణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శ్రీనివాస్‌ జయప్రకాశ్‌ కూడా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు.

Next Story