134 సీట్లు, బస్సు హోస్టెస్.. తక్కువ ఖర్చుతో లగ్జరీ బస్సు

మాట్లాడాతూ 132 సీట్ల సామర్థ్యంతో బస్సు రూపకల్పన జరుగుతోందని చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  4 July 2024 12:59 AM GMT
central minister nitin Gadkari,  134 seating bus, india,

 134 సీట్లు, బస్సు హోస్టెస్.. తక్కువ ఖర్చుతో లగ్జరీ బస్సు  

ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా ప్రజారవాణాకు అందుబాటులో ఉన్న బస్సుల్లో సీటింగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. చాలా వరకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే వెళ్తుంటారు. ఈ క్రమంలోనే సీట్ల కెపాసిటీని పెంచుతూ కొత్త బస్సును తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడాతూ 132 సీట్ల సామర్థ్యంతో బస్సు రూపకల్పన జరుగుతోందని చెప్పారు. నాగ్‌పూర్‌లో ఈ పైలట్ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విమానం మాదిరిగా సీట్లు, బస్‌ హోస్టెస్ ఇందులో ఉంటారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న డీజిల్‌ వాహనాల కంటే పర్యావరణ ఇంధనం సాయంతో ఈ బస్సును నడుపుతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

ప్రజా రవాణాలో కాలుష్య రహిత వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని గడ్కరీ తెలిపారు. ‘ఢిల్లీలో ప్రధానమైన సమస్య కాలుష్యం.. గాలి, నీరు, ధ్వని అంతా కలుషితమైపోయాయి. తక్కువ ఖర్చుతో కూడిన, కాలుష్య రహిత, స్వదేశీ రవాణా పరిష్కారాలు అవసరం. మన దగ్గర ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రస్తుతం 300 ఇథనాల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఆటోమొబైల్ కంపెనీ పర్యావరణహిత వాహనాలను తయారుచేస్తున్నాయి. కాబట్టి లీటరకు రూ.120 ఖర్చయితే.. ఇథనాల్‌కు అందులో సగం అంటే రూ.60 మాత్రమే అవుతుంది.. 60 శాతం విద్యుత్, 40 శాతం ఇథనాల్‌తో వాహనాలు నడపనున్నాయి.. దీని వల్ల కాలుష్యం తగ్గుతుంది’ అని మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అలాగే ప్రజలకు టికెట్‌ భారం కూడా తగ్గుతుందని చెప్పారు.

ఇందులో భాగంగా టాటా సంస్థతో కలిసి నాగ్‌పూర్‌ పైలట్‌ ప్రాజెక్టుగా ఈ బస్సును తీసుకొస్తున్నట్లు మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. చెక రిపబ్లిక్‌ వెళ్లిన సమయంలో మూడు బస్సులు కలిపిన ట్రాలీ చూశాననీ.. అంఉలో 132 మంది కూర్చూనేలా సీటింగ్ ఉందన్నారు. సీట్ల ముందు ల్యాప్‌టాప్‌ పెట్టుకోవడానికి సథలం, సౌకర్యవంతమైన కుర్చీలు, ఏసీలు అవసరమని సూచించానని గడ్కరీ పేర్కొన్నారు. ఎయిర్ హోస్టెస్‌ల మాదిరిగా ప్రయాణికులకు పండ్లు, ప్యాక్డ్ ఫుడ్, పానీయాలు అందజేయడానికి బస్ హోస్టెస్‌లు ఉండాలన్నారు. డీజిల్ బస్సు కంటే 30 శాతం తక్కువ ఖర్చు అవుతుంది.. సౌరశక్తిని ఉపయోగిస్తే, ఖర్చు మరింత తగ్గుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

Next Story