గూగుల్ క్రోమ్ వాడుతున్నవారికి కేంద్రం హెచ్చరిక

గూగుల్ క్రోమ్‌ను యూజ్ చేస్తున్నవారికి కీలక హెచ్చరికలు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  11 Aug 2024 6:39 AM IST
central govt, warning,    google chrome ,

గూగుల్ క్రోమ్ వాడుతున్నవారికి కేంద్రం హెచ్చరిక 

చాలా మంది ఇంటర్నెట్‌లో ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలన్నా.. ఏది సెర్చ్ చేయాలన్న గూగుల్ క్రోమ్‌న వాడుతుంటారు. అయితే..తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ గూగుల్ క్రోమ్‌ను యూజ్ చేస్తున్నవారికి కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్ బ్రౌజర్‌లో అనేక బగ్‌లు ఉన్నాయనీ తెలిపింది. వాటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని పేర్కొంది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In). ఈ మేరకు గూగుల్‌ యూజర్లు క్రోమ్ బ్రౌజర్లు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సెర్ట్ ఇన్ సూచించింది. అలా చేయడం ద్వారా అప్‌డేట్‌ అయ్యి సేఫ్‌గా ఉండొచ్చని పేర్కొంది. క్రోమ్ వెబ్‌ బ్రౌజర్‌లో చాలా లోపాలు ఉన్నాయనీ. .వాటిని వాడుకుని హ్యాకర్లు సిస్టమ్స్‌ను రిమోట్‌లోకి తీసుకుని నియంత్రించి అవకాశాలు ఉన్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పేర్కొంది.

హ్యాకర్లు క్రోమ్‌ను హ్యాక్ చేసిన తర్వాత సిస్టమ్‌లో స్టోర్ చేసి పెట్టుకుని ఉంచిన డేటాను కాపీ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. తద్వారా జనాల ప్రైవసీని కూడా హ్యాక్ చేసి వేధింపులకు పాల్పడే అవకాశాలు లేకపోలేదని తెలిపింది. సిస్టమ్‌ను రిమోట్‌గా షట్‌డౌన్ చేయవచ్చని గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో సేవ చేసుకున్న అన్ని పాస్‌వర్డ్‌లను సైతం తస్కరించేందుకు ఛాన్స్‌ ఉందని పేర్కొంది. అంతటితో ఆగకుండా మాల్వేర్‌ను నెట్‌వర్క్‌తో పాటు కంప్యూటర్‌లో చొప్పించేందుకు చాన్సెస్ ఉన్నాయని వెల్లడించింది. విండోస్‌, మ్యాక్‌ యూజర్లు తప్పనిసరిగా గూగుల్‌ క్రోమ్‌ 127.0.6533.88/89కి అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. క్రోమ్‌ బ్రౌజర్‌ను ఆటోమేటిక్‌ అప్‌డేట్‌ మోడ్‌లో ఉంచాలని.. తద్వారా ఎప్పటికప్పుడు లోపాలను నివారించవచ్చని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పేర్కొంది.

Next Story