ఐసీయూలో రోగుల అడ్మిషన్‌పై కేంద్రం కీలక మార్గదర్శకాలు
ఆస్పత్రుల్లోని ఐసీయూలో రోగులకు చికిత్సకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 2 Jan 2024 5:18 PM ISTఐసీయూలో రోగుల అడ్మిషన్‌పై కేంద్రం కీలక మార్గదర్శకాలు
ఆస్పత్రుల్లోని ఐసీయూలో రోగులకు చికిత్సకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రోగి అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకునేలా కొత్తగా జీవో ఇచ్చింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రత్యేకంగా రోగులను పరీక్షించడానికి ప్రోటోకాల్స్ అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో పలు సందర్భాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న సమయంలో ఐసీయూలో చికిత్స అందిస్తుంటారు వైద్యులు. అయితే.. ఐసీయూలో రోగుల అడ్మిషన్‌కు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు ఉన్నాయి. ఆస్పత్రిలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు, వారి బంధువులు నిరాకరించిన సందర్భంలో ఐసీయూలో చేర్చుకోలేరని వెల్లడించింది.
ఈ మార్గదర్శకాలను తయారు చేసిన వారిలో క్రిటికల్ కేర్ మెడిసిన్‌లో ప్రత్యేక అనుభవం ఉన్న 24 మంది ఉన్న వైద్యుల ప్యానెల్ ఉంది. ప్యానెల్ సభ్యులు మాట్లాడతూ.. ఐసీయూ పరిమిత వనరులున్నాయనీ చెప్పారు. ప్రతి ఒక్కరినీ చేర్చుకోవడం దవ్ఆరా, అత్యవసర కేసుల్లో రోగులకు అవసరమైనప్పుడు పడకలు అందుబాటులో ఉండకపోవచ్చని చెప్పారు. కాబట్టే ఈ మార్గదర్శకాలు అవసరమని ప్యానెల్ సభ్యులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు..ఈ మార్గదర్శకాల ద్వారా రోగి కుటుంబానికి, ఆస్పత్రి పరిపానలకు మధ్య పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. ఈ మేరకు చికిత్స ఇచ్చినా రోగి ఆరోగ్యంపై ఫలితం లేకపోతే.. రోగి మనుగడపై ప్రభావం చూపకుంటే ఐసీయూలో ఉంచడం వృథా అని నిపుణుల బృందం మార్గదర్శకాల్లో పేర్కొంది. రోగి జీవించే అవకాశాలు అస్సలు లేని సమయంలో ఐసీయూల్లో చేర్చుకోవద్దని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది.
అయితే.. కరోనా మహమ్మారి, విపత్తు పరిస్థితులు, వనరులు పరిమితంగా ఉన్న సమయంలో రోగిని ఐసీయూలో ఉంచడంపై తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది కేంద్రం. రోగి ఆర్గాన్స్ వైఫల్యం, ఆర్గాన్ సపోర్ట్ సమయంలో.. లేదంటే వైద్య పరిస్థితి క్షీణతను అంచనా వేయడంపై ఐసీయూలో చేర్చుకోవడం ఆధారపడి ఉండాలని వెల్లడించింది. శస్త్రచికిత్స తర్వాత పరిస్థితి దిగజారితే.. తర్వాత వచ్చే సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్న రోగులను ఐసీయూలో ఉంచడం అవసరమని తెలిపింది.