ఉద్యోగులకు శుభవార్త.. పీఎఫ్‌ విత్‌డ్రాకు ప్రత్యేక యాప్‌!

ఉద్యోగులకు తీపి కబురు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పీఎఫ్ (PF) ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ...

By -  అంజి
Published on : 10 Feb 2026 7:45 AM IST

EPFO UPI Withdrawal App, New PF Withdrawal Rules 2026, PF Money to Bank Account via UPI, Central Government New PF App, EPFO 3-Day Claim Settlement, PF Withdrawal Limit 5 Lakhs

ఉద్యోగులకు శుభవార్త.. పీఎఫ్‌ విత్‌డ్రాకు ప్రత్యేక యాప్‌!

ఉద్యోగులకు తీపి కబురు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పీఎఫ్ (PF) ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ, నేరుగా UPI ద్వారా బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ చేసే కొత్త వ్యవస్థను తీసుకురాబోతోంది. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్‌ అకౌంట్‌లో పీఎఫ్‌ సొమ్ము డిపాజిట్‌ అయ్యేలా కొత్త యాప్‌ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏప్రిల్‌లో ఇది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉన్న UMANG యాప్‌నకు అదనంగా ఇది పని చేస్తుంది. యాప్‌ ద్వారా రిక్వెస్ట్‌ పెట్టుకుంటే 3 రోజుల్లోనే గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం యూపీఐ ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా చేసుకునే ఫీచర్‌ లేదు.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులు తమ పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. కేవలం 3 రోజుల్లోనే గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను రూపొందిస్తోంది. ఇప్పటివరకు పీఎఫ్ విత్‌డ్రాకు యూపీఐ సదుపాయం లేదు. కొత్త యాప్‌తో యూపీఐ ద్వారా తక్షణమే నగదు బదిలీ సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఉన్న ఉమంగ్ యాప్ సేవలు కొనసాగుతూనే ఉంటాయి, దానికి అదనంగా ఈ కొత్త యాప్ అందుబాటులోకి రానుంది. దరఖాస్తు చేసుకున్న 3 పనిదినాల్లోనే రూ. 5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పీఎఫ్ క్లెయిమ్‌ల ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించి, ఉద్యోగులకు ఆర్థిక అత్యవసర సమయాల్లో వేగంగా నగదు అందేలా చూడటం.

Next Story