పన్ను చెల్లింపుదారులకు కేంద్రం శుభవార్త
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 8 Oct 2023 2:18 PM IST
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం శుభవార్త
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ట్యాక్స్ పేయర్స్‌కు ఆదాయపన్ను శాఖ అధికారులు జారీ చేసిన డిమాండ్ నోటీసులపై అప్పీల్ చేసుకునే సమయాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట లభించినట్లు అయ్యింది.
జీఎస్‌టీ అమ్నెస్టీ పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది కేంద్రం. ఇది జీఎస్టీ కౌన్సిల్ ట్యాక్స్ పేయర్స్‌కు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. స్కీమ్ వివరాలను రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్ర ప్రకటించారు. ఐటీఆర్‌ను దాఖలు చేసిన తర్వాత ట్యాక్స్ అధికారులు సంబంధిత వివరాలు ఈ వివరాలన్నీ సరిపోలుతున్నాయో లేదో తెలుసుకోవడానికి డిక్లరేషన్‌లు, చెల్లించిన పన్నులను పరిశీలిస్తుంది. అయితే.. ట్యాక్స్ పేయర్స్ చెల్లించాల్సిన దానికంటే తక్కువ ట్యాక్స్ చెల్లించినట్లు అయ్యితే.. ఆదాయపన్ను శాఖ డిమాండ్ నోటీసు జారీ చేస్తుంది. ఈ డిమాండ్ ఆర్డర్స్‌పై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని పొడిగిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ట్యాక్స్ అధికారులు జారీ చేసిన ఆదేశాలపై అసెసీ అప్పీల్ చేయాలంటే 3 నెలల సమయమే ఉంటుంది. దీనిని మరో నెల వరకు పొడిగించడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ నమోదిత వ్యాపారాలకు అదనపు సమయాన్ని ఇచ్చారు. దీనికోసం ప్రస్తుతం జమ చేస్తున్న శాతం పన్ను డిమాండ్ డిపాజిట్‌కు బదులు 12.5 శాతం జమ చేయాల్సి ఉంటుంది.