డీఏ పెంపుపై ఉద్యోగులకు త్వరలో కేంద్రం గుడ్‌న్యూస్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 25 Feb 2024 5:42 AM GMTడీఏ పెంపుపై ఉద్యోగులకు త్వరలో కేంద్రం గుడ్‌న్యూస్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ)ను కేంద్ర ప్రభుత్వం పెంచే అవకావాలు ఉన్నాయి. ఈ మేరకు ఇదే విషయాన్ని పలు నివేదికలు చెబుతున్నాయి. కాగా.. ఈసారి డీఏను కేంద్ర ప్రభుత్వం 4 శాతం పెంచనున్నట్లు సమచారం. తాజాగా 4 శాతం డీఎ పెంపు తర్వాత డియర్ నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) 50 శాతానికి పైగా పెరగనుంది.
గతంలో 2023 అక్టోబర్ నెలలో కేంద్రం డీఏను 4 శాతం పెంచింది. అప్పుడు 4 శాతం డీఏ పెంచడంతో 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. తాజాగా కేంద్రం ప్రభుత్వం మరోసారి 4 శాతం డీఏ పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఇక గతంలోనే పారామిలటరీ బలగాలతో సహా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ గ్రూప్‌బి స్థాయి అధికారులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి సందర్భంగా బోనస్‌లను అందించింది. 2022-2023 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అడ్ హాక్ బోనస్‌ల లెక్కింపు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.7వేల పరిమితిని నిర్ణయించింది.
డీఏ పెంపు నిర్ణయాన్ని కేంద్రం దేశ ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కవగా ఉంటే మరింత ఎక్కువగా డీఏను పెంచే అవకాశాలు లేకపోలేదు. డీఏ, డీఆర్ పెరుగుదల అంశాలు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 12 నెలల సగటు పెరుగుల శాతం ద్వారా నిర్ణయిస్తారు.