300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు.. అప్లై చేసుకోండిలా..

ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశ ప్రజలకు గుడ్‌ న్యూస్ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  14 Feb 2024 1:30 AM GMT
central govt, 300 units, free power, application process ,

 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు.. అప్లై చేసుకోండిలా..

ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశ ప్రజలకు గుడ్‌ న్యూస్ చెప్పారు. కోటి మందికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 13వ తేదీన ఒక పథకాన్ని ప్రారంభించారు. రూఫ్‌టాప్‌ సోలార్‌రైజేషన్‌ స్కీమ్‌గా తెలిపారు. ఇక కేంద్ర బడ్జెట్‌లో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకం గురించి చెప్పిన విషయం తెలిసిందే. కోటి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించనుంది కేంద్ర ప్రభుత్వం. తద్వారా వారికి 300 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. కాగా.. ఈ స్కీం పేరును 'పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన' గా ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

ఈ పథకం కోసం pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. మరి రూఫ్‌టాప్ సోలార్ కోసం కూడా అప్లై చేసుకోవాలి. ఉచిత విద్యుత్‌ను ఎలా పొందాలో వివరణ

* ముందుగా pmsuryaghar.gov.in పోర్టల్‌లో మీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి

* ఇందులో రాష్ట్రం పేరు, విద్యుత్ సరఫరా చేసే కంపెనీ పేరును ఎంపిక చేయాలి

* తర్వాత విద్యుత్‌ కనెక్షన్ కన్జూమర్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీని పూర్తి చేయాలి

* పోర్టల్ నియమ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

* ఆ తర్వాత వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్‌తో లాగిన్చేయాలి

* రూఫ్‌ ఆప్‌ కోసం అప్లై చేసుకోవాలి

* అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత డిస్కమ్ అనుమతి వేచ్చే వరకు వేచిచూడాలి

* డిస్కమ్ అనుమతి వచ్చాక విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి

* ఇన్‌స్టాలేషన్ పూర్తయ్యాక ప్లాంట్ వివరాలను పోర్టల్‌లో సమర్పించాలి, నెట్‌ మీటర్‌ కోసం అప్లై చేయాలి

* నెట్‌ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేశాక డిస్కమ్ అధికారులు తనిఖీ చేస్తారు

* తర్వాత పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు

* ఈ రిపోర్టు అందాక బ్యాంకు అకౌంట్ డిటెయిల్స్ సహా క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి

* 30 రోజుల్లో మీ ఖాతాల్లో సబ్సిడీ జమ అవుతోంది

Next Story