ఎంపీల జీతాలు పెంచిన కేంద్ర ప్రభుత్వం
కేంద్రప్రభుత్వం ఎంపీలకు శుభవార్త చెప్పింది.
By Knakam Karthik
వారికి గుడ్‌న్యూస్..జీతాలు పెంచిన కేంద్ర ప్రభుత్వం
కేంద్రప్రభుత్వం ఎంపీలకు శుభవార్త చెప్పింది. వారి జీతభత్యాలతో పాటు పెన్షన్, అదనపు పెన్షన్‌ను సైతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపును 2023, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. లోక్ సభ, రాజ్య సభ్య ఎంపీలకు నెల జీతం రూ. లక్ష నుంచి లక్షా 24 వేలకు, అలాగే వారికిచ్చే దినసరి భత్యాన్ని రూ. 2 వేల నుంచి రూ. 2, 500కు పెంచింది.
మాజీ ఎంపీలకు సైతం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుభవార్త వినిపించింది. మాజీ ఎంపీ పెన్షన్‌ను నెలకు రూ. 25 వేలు నుంచి రూ.31 వేలకు సవరించింది. ఐదేళ్లకుపైగా ప్రతి అదనపు సంవత్సరానికి అదనపు పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.2.500కు పెంచింది. చివరిగా 2018లో ఎంపీల జీతభత్యాలు పెంచారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో లోక్ సభకు 543, రాజ్యసభకు 245 మంది ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరందరికీ కూడా ఈ పెంపు వర్తించనుంది. రోజు రోజుకు ఖర్చులు పెడుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.