రికార్డు క్రియేట్ చేసిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి కొత్త రికార్డును క్రియేట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 23 July 2024 12:00 PM IST
రికార్డు క్రియేట్ చేసిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి కొత్త రికార్డును క్రియేట్ చేశారు. వరుసగా ఏడోసారి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె రికార్డును నెలకొల్పారు. నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాఇ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెటటారు. ఇప్పటి వరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఆరు వార్షి బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన రికార్డు ఉండేది. 1959-64 మధ్య ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు, ఒక తాత్కాలిక బడ్జెట్‌ను మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టారు.
2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి కేంద్రంలో ఏర్పాటు అయ్యింది. 2019-2020 ఆర్తిక సంవత్సరం నుంచి 2023-2024 ఏఆడి వరకు వరుసగా ఐదు సార్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరి 1వ తేదీన తాత్కాలిక బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు. ఇక తాజాగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించడంతో.. గతంలో మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రేక్ చేశారు. కొత్త చరిత్రను లిఖించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని తొలి (2014) కేబినెట్‌లో నిర్మలా సీతారామన్ వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2017లో కీలకైన రక్షణ శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఆ తర్వాత రెండో సారి 2019లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆర్థికశాఖ బాధ్యతలను తీసుకున్నారు. కేంద్ర మంత్రివర్గంలో మూడోసారి వరుసగా చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ పేరిట మరో రికార్డు కూడా ఉండటం విశేషం.