కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 8:45 PM IST
కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ప్రధానిగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఆదివారమే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు.. కేంద్రమంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత సోమవారం బాధ్యతలను తీసుకున్నారు. ఇక ఆ తర్వాత సాయంత్రం ఈ టర్మ్‌లో తొలి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సమావేశం తర్వాత కేంద్ర మంత్రులకు శాఖలను కేటాయించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు కేంద్ర కేబినెట్‌లో ఉన్నారు. వారికి కూడా శాఖలను కేటాయించారు. కిషన్‌రెడ్డికి బొగ్గు, గనుల శాఖ కేటాయించగా.. పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్, రూరల్ డెవలప్‌మెంట్ మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా డాక్టర్ పెమ్మసాని, శ్రీనివాసవర్మకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవి లభించింది.
ఇక రక్షణ శాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రిత్వ, సహకారశాఖ మంత్రిగా అమిత్‌షా, రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ ఉన్నారు. నిర్మలాసీతారామన్‌కు ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలశాఖ తీసుకున్నారు. జేపీ నడ్డా ఆరోగ్య, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నారు.
మంత్రులు- కేటాయించిన శాఖలు
శివరాజ్ సింగ్ చౌహాన్ - వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి
సుబ్రహ్మణ్యం జైశంకర్- విదేశీ వ్యవహారాలు
మనోహర్ లాల్ ఖట్టర్ - గృహనిర్మాణ, పట్టణభివృద్ధి, విద్యుత్
చ్.డి. కుమారస్వామి- భారీ పరిశ్రమలు, ఉక్కు
పీయూష్ వేద్ ప్రకాశ్ గోయల్ (భాజపా)- వాణిజ్య, పరిశ్రమలు
ధర్మేంద్ర ప్రధాన్ - విద్య
జీతన్ రామ్ మాంఝి - సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
రాజీవ్ రంజన్ (లలన్)సింగ్ - పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ
సర్బానంద్ సోనోవాల్ - షిప్పింగ్, పోర్టులు, వాటర్ వేస్
వీరేంద్ర కుమార్- సామాజిక న్యాయం, సాధికారత
ప్రహ్లాద్ వెంకటేష్ జోషి- వినియోగదారుల వ్యవహారాలు; ఆహార, ప్రజాపంపిణీ
జుయెల్ ఓరం - గిరిజన వ్యవహారాలు
గిరిరాజ్ సింగ్- జౌళి పరిశ్రమ
అశ్వినీ వైష్ణవ్ - రైల్వే, సమాచార - ప్రసారాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్
జ్యోతిరాదిత్య సింధియా - కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
భూపేంద్ర యాదవ్ - పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు
గజేంద్రసింగ్ షెకావత్- పర్యటక, సాంస్కృతికం
అన్నపూర్ణాదేవి - మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
కిరణ్ రిజిజు - పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు
హర్దీప్ సింగ్ పూరి - పెట్రోలియం, సహజవాయువులు
మనస్సుఖ్ ఎల్. మాండవీయ - కార్మిక, ఉపాధి కల్పన, క్రీడలు - యువజన వ్యవహారాలు
చిరాగ్ పాసవాన్ - ఆహార శుద్ధి పరిశ్రమలు
సి.ఆర్.పాటిల్- జల్ శక్తి