ఫిబ్రవరి 14 : వాలంటైన్స్ డే కాదు.. 'కౌ హగ్ డే' జరుపుకోండి
Celebrate February 14 as Cow Hug Day.ఫిబ్రవరి 14 అంటే చాలా మందికి ఎంతో ఇష్టం
By తోట వంశీ కుమార్
ఫిబ్రవరి 14 అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ రోజుప్రేమికుల దినోత్సవం కాబట్టి. యువతీ, యువకులు ఆ రోజున తాము ప్రేమించిన వారికి తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. అప్పటికే ప్రేమలో ఉన్న జంట బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. అయితే.. ఇది మన దేశ సంప్రదాయం కాదని, దీన్ని విమర్శించే వారు లేకపోలేదు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతున్న యువతలో మార్పు తీసుకురావాలని కేంద్ర పశుసంవర్థక శాఖ భావిస్తోంది.
అందుకని ఫిబ్రవరి 14న కౌ హగ్ డే (Cow hug day)జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఆ రోజు ఆవును ప్రేమగా దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉత్తర్వుల్లో పేర్కొంది.
భారతీ సంస్కృతికీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవులు వెన్నుముక. పశుసందకు, జీవ వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మానవులకు సకల సంపదలను అందించే తల్లి. అందుకనే ఆవును కామధేను, గోమాత అని పిలుస్తారు. అలాంటి గోవులను ఆలింగనం చేసుకోవడం ద్వారా దేహంలోకి సానుకూల శక్తి ప్రవహించడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది. వేదాల్లో దీని ప్రస్తావన ఉంది. అయితే.. విదేశీ నాగరికత ప్రభావంతో మనం మరిపోతున్నాం. కాబట్టి గో ప్రేమికులు అందరూ కౌ హగ్ డేను జరుకోవాలని ప్రకనటలో కోరింది.