నేడు సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు..!
CBSE 10th class result 2021 expected to release Today.కరోనా మహమ్మారి కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ
By తోట వంశీ కుమార్ Published on 20 July 2021 11:57 AM ISTకరోనా మహమ్మారి కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) బోర్డు పరీక్షలు రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షా ఫలితాలు నేడు వెలువడే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నట్లు ఆంగ్ల మీడియాలు పేర్కొంటున్నాయి. అయితే.. దీనిపై ఇప్పటి వరకు సీబీఎస్ఈ బోర్డు గానీ కేంద్ర విద్యాశాఖ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే.. బోర్డు చెప్పిన వివరాల ప్రకారం ఫలితాలు నేడు విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఫలితాలను వెబ్‌సైట్‌తో పాటు డిజిలాకర్ యాప్‌లో చూసుకోవచ్చు.
కాగా.. అంతకుముందు జూలై 20 నాటికల్లా ఫలితాలను వెల్లడించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్టు వెల్లడించింది. జూలై 20న పదో తరగతి పరీక్షల ఫలితాలు, జూలై 31 నాటికి 12వ తరగతి ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే.. ఈ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు.. కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత మళ్లీ పరీక్ష రాసేలా అవకాశం ఇస్తామని సీబీఎస్ఈ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా దీనికోసం సీబీఎస్ఈ మళ్లీ నోటిఫికెషన్ ఇవ్వనుంది. పరీక్షలకు 15 రోజుల ముందు విద్యార్థులకు సమాచామివ్వనుంది.
ఫలితాలను కోసం ఇలా చేయండి..
సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ https://www.cbse.gov.in/ లేదా http://cbseresults.nic.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. దీంతోపాటు డిజిలాకర్ యాప్‌లో ఫలితాలు ప్రత్యేకంగా చూడవచ్చు. వ్యక్తిగత వివరాలను వైబ్‌సైట్‌లో పొందుపరిస్తే సరిపోతుంది.