పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమి పాలయ్యారు. పటియాల నుంచి బరిలోకి దిగిన అమరీందర్ ను ఆప్ అభ్యర్థి అజిత్‌పాల్ కోహ్లీ ఓడించారు. 19,797 ఓట్ల తేడాతో కెప్టెన్ పరాయజం పాలయ్యారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్‌ను వీడిన అమరీందర్.. కొత్తగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయినప్పటికీ ఇవేవీ ఆయన్ను గెలిపించలేకపోయాయి.
ఇక తన ఓటమిపై కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తున్నానని అన్నారు. 'ప్రజల తీర్పును నిరాడంబరంగా స్వీకరిస్తున్నాను. ప్రజాస్వామ్యం విజయం సాధించింది. పంజాబీ ప్రజలు.. కులం, మతం అన్న గోడలను దాటి తమ తీర్పును ఇచ్చారు. పంజాబియత్ స్ఫూర్తిని చాటారు.' అంటూ కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.