రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించిన కేంద్రం..!
కేంద్ర మంత్రివర్గం బుధవారం 6 కీలక నిర్ణయాలు తీసుకుంది.
By - Medi Samrat |
కేంద్ర మంత్రివర్గం బుధవారం 6 కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ మొత్తం రూ.94,916 కోట్లు కేటాయింపులు చేసింది. ఇందులో 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పాటు ఉత్పాదకత సంబంధిత బోనస్‌గా రూ.1865.68 కోట్లు చెల్లించడానికి ఆమోదం తెలిపింది. ఈ బోనస్ ఉద్యోగుల 78 రోజుల జీతంతో సమానమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రతి సంవత్సరం దుర్గాపూజ/దసరా సెలవులకు ముందు అర్హులైన రైల్వే ఉద్యోగులకు PLB చెల్లించబడుతుంది. గతేడాది రైల్వే ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్‌ను మోదీ ప్రభుత్వం ఆమోదించింది. దీంతో 11,72,240 మంది ఉద్యోగులు లబ్ధి పొందారు.
అర్హత కలిగిన రైల్వే ఉద్యోగికి 78 రోజుల పాటు చెల్లించాల్సిన గరిష్ట మొత్తం రూ.17,951. ఈ మొత్తాన్ని అనేక రకాల రైల్వే ఉద్యోగులకు ఇవ్వనున్నారు. వీరిలో ట్రాక్ మెయింటైనర్, లోకోమోటివ్ పైలట్, రైలు మేనేజర్ (గార్డ్), స్టేషన్ మాస్టర్, సూపర్‌వైజర్, టెక్నీషియన్, టెక్నీషియన్ హెల్పర్, పాయింట్స్‌మన్, మినిస్టీరియల్ స్టాఫ్, ఇతర గ్రూప్ 'సి' ఉద్యోగులు ఉన్నారు. "2024-25 సంవత్సరంలో రైల్వే పనితీరు చాలా బాగుంది. రైల్వే రికార్డు స్థాయిలో 1614.90 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి 7.3 బిలియన్ల మంది ప్రయాణికులను తీసుకువెళ్లింది" అని ప్రభుత్వం పేర్కొంది.
నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్‌కు కూడా కేంద్ర మంత్రివర్తం ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలిపారు. భక్తియార్‌పూర్-రాజ్‌గిర్-తిలయా రైల్వే లైన్ కోసం రూ.2192 కోట్లు చెల్లించారు. బీహార్‌లోని బెట్టియా నుంచి జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ వరకు నాలుగు లైన్ల రహదారికి రూ.3822 కోట్లు కేటాయించారు.