1 లోక్‌సభ, 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుద‌ల‌

Bypoll to one LS five assembly seats on December 5.మెయిన్‌పురి లోక్‌సభ స్థానంతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2022 1:22 PM IST
1 లోక్‌సభ, 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుద‌ల‌

సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానంతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఉప ఎన్నికల న‌గారా మోగింది. ఒడిశాలోని పదంపూర్‌, రాజస్థాన్‌లోని సర్దార్‌ షహర్‌, బీహార్‌లోని కుర్హనీ, ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్‌, యూపీలోని రామ్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికకు సంబంధించిన నోటిఫికేష‌న్ల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది.

ఈ నెల 10న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేష‌న్ల ప్ర‌క్రియ మొద‌లుకానుంది. న‌వంబ‌ర్ 17 వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. డిసెంబ‌ర్ 5న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 8న కౌంటింగ్ ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌నున్నారు.

Next Story