మరో కొత్త తుఫాను భయం.. నేడు తీరం దాటనున్న 'బురేవి' తుఫాను

Burevi Cylclone .. తమిళనాడుకు మరో తుఫాను భయం పట్టుకుంది. ఇప్పటికే 'నివర్‌' తుఫాను అతలాకుతం చేస్తుండగా, ఇప్పుడు '

By సుభాష్  Published on  2 Dec 2020 2:52 AM GMT
మరో కొత్త తుఫాను భయం.. నేడు తీరం దాటనున్న బురేవి తుఫాను

తమిళనాడుకు మరో తుఫాను భయం పట్టుకుంది. ఇప్పటికే 'నివర్‌' తుఫాను అతలాకుతం చేస్తుండగా, ఇప్పుడు 'బురేవి' తుఫాను భయం పట్టుకుంది. బుధవారం సాయంత్రం లేదా రాత్రి దక్షిణ తమిళనాడు జిల్లాల్లో తీరం దాటే అవకాశం ఉండటంతో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి మంగళవారం చెన్నై సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తుఫాను సహాయక చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ బంగాళాఖాతంలో గత నెల 28 నుంచి కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా మారి 24 గంటల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

మంగళవాం సాయంత్రానికి 11 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదిలిందని, నేడు సాయంత్ర వరకు లేదా , రాత్రిలోగా త్రికోణకొండలు సమీపంలో తీరం దాటనుందని అంచనా వేశారు. ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకూడి, తెన్‌కాశీ జిల్లాల్లో 3,4 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

బురేవి తుఫానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమై అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని, ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. తుఫాను ప్రభావంతో 20 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను నాగ్‌ర్‌కోవిల్‌కు పంపామన్నారు.

Next Story