'బురేవి' తుఫాను అతలాకుతలం చేస్తోంది. తుఫాను ప్రభావం కారణంగా దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోనూ బురేవి తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. తమిళనాడు తీర ప్రాంతాల్లోని రామేశ్వరం, దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలకుతోడు బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
ఈ ఈదురు గాలులకు రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటిలో పురాతన చర్చి గోడలు కూలిపోయాయి. దీంతో ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న ఈ చర్చి.. తుఫాను కారణంగా మరింత శిథిలావస్థకు చేరుకుంది. దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన చర్చి తుఫాను ధాటికి కూలిపోయింది. ఈ చర్చికి సంబంధించిన వీడియో చూడండి.