సీపీఎం నేత, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్జీ (80) కన్నుమూశారు. బుద్ధదేవ్ భట్టాచార్జీ (80) ఇవాళ ఉదయం 8.20 నిమిషాలకు మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 34 ఏళ్ల సీపీఎం పాలనలో ఈయన చివరి సీఎం. 2000 నుంచి 2011 వరకు కంటిన్యూగా 11 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు.
గతేడాది అతనికి న్యుమోనియా సోకడంతో లైఫ్ సపోర్టు పెట్టాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత సీనియర్ సిపిఎం నాయకుడు కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ అనారోగ్యం బారిన పడి కన్నుమూశారు. భట్టాచార్జీ.. సీపీఎం యొక్క అత్యున్నత నిర్ణయాధికార సంస్థ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు కూడా.. 2000 నుండి 2011 వరకు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. జ్యోతిబసు తర్వాత అత్యున్నత పదవిలో ఉన్నారు. తూర్పు రాష్ట్రంలో 34 ఏళ్ల కమ్యూనిస్ట్ పాలనకు ముగింపు పలికి, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చారిత్రాత్మక విజయాన్ని సాధించినప్పుడు, 2011 రాష్ట్ర ఎన్నికలలో భట్టాచార్జీ ఓడిపోయారు.