అమృత్‌సర్‌ సమీపంలో డ్రోన్ కలకలం.. ఈసారి ఏమి విడిచిపెట్టిందంటే..?

BSF recovers 3 kg heroin airdropped by drone near Pakistan border in Punjab's Amritsar. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో పాకిస్తాన్ డ్రోన్ ద్వారా జారవిడిచిన

By M.S.R  Published on  15 April 2023 6:45 PM IST
అమృత్‌సర్‌ సమీపంలో డ్రోన్ కలకలం.. ఈసారి ఏమి విడిచిపెట్టిందంటే..?

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో పాకిస్తాన్ డ్రోన్ ద్వారా జారవిడిచిన మూడు కిలోగ్రాముల హెరాయిన్‌ను BSF దళాలు స్వాధీనం చేసుకున్నాయని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 3.21 గంటలకు అమృత్‌సర్‌లోని ముల్లకోట్ గ్రామ సమీపంలోని ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ ను భద్రతా సిబ్బంది గుర్తించింది. మానవ రహిత వైమానిక వాహనంపై బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారు.

తదుపరి సెర్చ్ ఆపరేషన్‌లో బచివింద్ గ్రామంలోని గోధుమల పొలంలో 3.20 కిలోగ్రాముల బరువున్న మూడు హెరాయిన్ ప్యాకెట్లతో కూడిన బ్యాగ్‌ను BSF దళాలు స్వాధీనం చేసుకున్నాయని BSF అధికార ప్రతినిధి తెలిపారు. ప్రకాశవంతమైన స్ట్రిప్ కూడా ఉందని అధికారి తెలిపారు.

బుధవారం అర్ధరాత్రి కూడా జమ్మూ కశ్మీర్‌ రాజౌరీ జిల్లాలోని బెరీ పట్టాన్ ప్రాంతంలో డ్రోన్ ను కుప్పకూల్చారు అధికారులు. ఈ డ్రోన్‌లో భారతీయ కరెన్సీతో పాటు ఆయుధాలు, అనుమానాస్పద వస్తువులు ఉన్నాయి. డ్రోన్‌ను పాక్ భూభాగం నుంచి పంపినట్లు అనుమానిస్తున్నామని భారత భద్రతాధికారులు తెలిపారు. నియంత్రణ రేఖ వద్ద అనుమానాస్పదంగా వైమానిక వస్తువులు తరలిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని, ఈ నేపథ్యంలోనే డ్రోన్ ను కూల్చేశామని చెప్పారు. డ్రోన్‌లో రూ.2 లక్షల భారతీయ నగదు, 131 రౌండ్ల ఏకే-47 బుల్లెట్లు, 5 మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు.


Next Story