రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ వ్యక్తి.. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే అతడికి రెస్టారెంట్‌లో ఊహించని షాక్ తగిలింది. వెజ్ బిర్యానీలో మాంసం బొక్కలు రావడంతో ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ తర్వాత రెస్టారెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సోమవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని విజయ్‌నగర్ ప్రాంతంలో జరిగింది. శాఖాహారి అయిన కస్టమర్‌కు మాంసాహారం అందించినందుకు రెస్టారెంట్ యజమానిపై కేసు నమోదైంది. ఆకాష్ దూబే అనే వ్యక్తి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాడు కానీ అతని బిర్యానీలో మాంసం బొక్కలు కనిపించాయి.
అతను దాని గురించి రెస్టారెంట్ మేనేజర్, సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత వారు అతనికి క్షమాపణ చెప్పారు. విజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆకాష్ ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. "విజయ్ నగర్ పోలీసులు రెస్టారెంట్ మేనేజర్ స్వప్నిల్ గుజరాతీపై సెక్షన్ 298 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం, ఈ విషయం దర్యాప్తులో ఉంది, ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాము" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంపత్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరులో తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని ఆర్ని పట్టణంలోని శాఖాహార రెస్టారెంట్ నుండి తాను ఆర్డర్ చేసిన ఆహారంలో ఎలుక తల వచ్చిందని ఓ వ్యక్తి చెప్పిన విషయం తెలిసిందే.