జైపూర్‌లో ఆరు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్.. అలర్ట్
రాజస్థాన్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపాయి.
By Srikanth Gundamalla Published on 13 May 2024 10:59 AM ISTజైపూర్‌లో ఆరు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్.. అలర్ట్
రాజస్థాన్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపాయి. జైపూర్‌లోని ఎయిర్‌పోర్టుకి ఇటీవల ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆరుకి పాఠశాలలకు బాంబు బెదిరింపులు పంపారు దుండగులు. ఈ మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఈమెయిల్ ఐడీలకు వీటిని పంపారు. దాంతో.. మెయిల్ వచ్చిన ప్రధానోపాధ్యాయులు అలర్ట్ అయ్యారు. పోలీసులకు.. బాంబ్ స్క్వాడ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే జైపూర్‌లో మరోసారి కలకలం రేగింది.
మెయిల్‌లో దుండగులు పంపిన సందేశం మేరకు.. పాఠశాల భవనంలో బాంబు ఉందనీ.. అది పేలుతుందని రాసి సెండ్ చేశారు. మోతీ దుంగ్రీలో ఉన్న ఎంపీఎస్ స్కూల్‌కి మొదటగా ఈ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రిన్సిపాల్ సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే బాంబు డిస్పోజల్ టీమ్‌తో అక్కడికి చేరుకున్నారు. బాంబు ఉందా అనే దానిపై పరీక్షిస్తున్నారు. మెయిల్ పంపిన వ్యక్తి ఈ-మెయిల్ ఐడీకి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. దాదాపు ఆరు స్కూళ్లకు ఇలాంటి ఈ-మెయిల్స్ వచ్చాయని పోలీసులు వెల్లడించారు. మెయిల్ వెళ్లిన ప్రతి స్కూల్‌కు పోలీసు బృందాలను పంపి.. సోదాలను నిర్వహిస్తున్నారు. బాంబు బెదిరింపు వచ్చిన స్కూల్స్ లిస్ట్‌లో మనక్ చౌక్, విద్యాధర్ నగర్, వైశాలి నగర్, బగ్రులోని శివారు రోడ్డులో ఉన్న పాఠశాలలు ఉన్నాయి. అలాగే.. మల్పుర్‌గేట్ బంబలా పులియాలో ఉన్న పాఠశాలలో బాంబు ఉన్నట్లు సమాచారం.
ఇక జైపూర్‌లో కొన్నాళ్లుగా ఈ బాంబె బెదిరింపులు కలకలం రేపుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా ఎయిర్‌పోర్టును పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. బెదిరింపు తర్వాత, విమానాశ్రయ భద్రతా సిబ్బంది, పోలీసులు, బాంబు నిర్వీర్య స్క్వాడ్ అలర్ట్ అయ్యారు. జైపూర్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం ఇది ఆరోసారి. అంతకుముందు మే 3న కూడా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. కానీ.. అన్నిసార్లు కూడా ఫేక్‌గానే నిర్ధారించారు.