ముఖ్యమంత్రికి బాంబు బెదిరింపు కాల్, నిందితుడు అరెస్ట్
కొంత కాలం నుంచి ఇండియాలో బాంబు బెదిరింపు కాల్స్ బాగా ఎక్కువయ్యాయి.
By Srikanth Gundamalla Published on 6 Aug 2024 8:00 AM GMTముఖ్యమంత్రికి బాంబు బెదిరింపు కాల్, నిందితుడు అరెస్ట్
కొంత కాలం నుంచి ఇండియాలో బాంబు బెదిరింపు కాల్స్ బాగా ఎక్కువయ్యాయి. స్కూళ్లకు, ఎయిర్‌పోర్టులకు, వివిధ కార్యాలయాలకు కొందరు ఆకతాయిలు కాల్స్ చేసి బాంబులు పెట్టామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక ఆరా తీస్తే దాదాపుగా అన్ని కూడా ఫేక్ కాల్స్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు కాల్ చేశాడు. ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా నుంచి కాల్ చేస్తున్నానని చెప్పి పాట్నాలోని సీఎం కార్యాలయానికి కాల్ చేశాడు. సీఎం కార్యాలయాన్ని బాంబుతో లేపేస్తానంటూ బెదిరించాడు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ కార్యాలయానికే బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే రంగంలోకి దిగి కాల్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీశారు. దర్యాప్తులో భాగంగా అతనిపై కేసు నమోదు చేశారు. చివరకు ఎలాగోలా బాంబ్ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని కొనుగొన్నారు. అనుమానితుడిని కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బీహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన 51 ఏళ్ల మహ్మద్ జిహాద్‌గా గుర్తించారు. మరోవైపు ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఉగ్రవాద సంస్థలతో అతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
కాగా.. గతంలో ఓ బాలుడు టీవీల్లో వస్తున్న వార్తలు చూసి.. తాను కూడా బాంబు బెదిరింపు కాల్ చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌పోర్టుకు మెయిల్ పెట్టి అందరినీ ఉరుకులూ పరుగులు పెట్టించాడు. మరో చోట ఓ వ్యక్తి తన క్యాన్సిల్ చేసుకున్న టికెట్‌కు డబ్బులు తిరిగి ఇవ్వలేదని తాను ఎక్కాల్సిన విమానానికే బాంబు బెదిరింపు కాల్ చేశాడు.