విజయ్‌కు డిప్యూటీ సీఎం ఆఫర్, 80 సీట్లు.. బీజేపీతో టీవీకే పొత్తు చర్చలు!

తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By -  అంజి
Published on : 15 March 2026 12:40 PM IST

Actor Vijay TVK BJP Alliance, Tamil Nadu Assembly Elections 2026, Vijay Deputy CM Offer, NDA Seat Sharing TVK, Tamilaga Vettri Kazhagam Politics, Vijay vs DMK AIADMK

విజయ్‌కు డిప్యూటీ సీఎం ఆఫర్, 80 సీట్లు.. బీజేపీతో టీవీకే పొత్తు చర్చలు!

తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అగ్ర నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని ఎన్డీయే (NDA) కూటమిలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో విజయ్‌కు బీజేపీ ఒక భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే, విజయ్‌కు ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పదవిని ఇచ్చేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా టీవీకే పార్టీకి సుమారు 80 అసెంబ్లీ స్థానాలను కేటాయించేందుకు కూడా కమలం పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయి.

తమిళనాడులో విజయ్‌కు ఉన్న అశేష అభిమాన గణాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రంలో త్రిముఖ లేదా చతుర్ముఖ పోటీ నెలకొన్నప్పుడు, కేవలం 2 శాతం ఓట్ల వ్యత్యాసం కూడా గెలుపోటములను శాసిస్తుందని బీజేపీ భావిస్తోంది. అందుకే విజయ్ లాంటి పాపులర్ స్టార్‌ను తమ కూటమిలోకి చేర్చుకోవడం ద్వారా అధికారాన్ని దక్కించుకోవచ్చని ఆశిస్తోంది. అయితే, విజయ్ మాత్రం నేరుగా ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినట్లు సమాచారం, ఇదే ఇప్పుడు చర్చల్లో కీలక అంశంగా మారింది.

మరోవైపు, బీజేపీతో పొత్తుపై విజయ్ అంతర్గత వర్గాల్లో కొంత ఆందోళన నెలకొంది. రాజకీయాల్లోకి స్వతంత్రంగా వచ్చి, సరికొత్త ప్రత్యామ్నాయంగా నిలవాలనుకున్న తరుణంలో.. జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే పార్టీ విశ్వసనీయత దెబ్బతింటుందేమోనని విజయ్ సలహాదారులు భయపడుతున్నారు. ఒక రాష్ట్రానికి చెందిన డిప్యూటీ సీఎం ఈ చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ పొత్తు కుదిరితే తమిళనాడు ఎన్నికల చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

Next Story