బీజేపీ ఎంపీ రామ్ స్వ‌రూప్ శ‌ర్మ ఆత్మ‌హ‌త్య‌

BJP MP Ram Swaroop Sharma died by suicide.హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2021 5:10 AM GMT
BJP MP Ram Swaroop Sharma died by suicide

హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం ఆయ‌న ఢిల్లీలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న వ‌య‌సు 62 సంవ‌త్స‌రాలు. ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ఎంపీ రాంస్వరూప్ శర్మ గది లోపలి నుండి మూసివేసి ఉండగా.. ఆయ‌న సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు.. రామ్‌స్వరూప్ శర్మను ఉరి నుంచి కిందకు దించి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించాడని పోలీసులు తెలిపారు. ఇంతవరకు సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. అనుమానాస్ప‌ద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


ఆర్ఎంఎల్ ఆస్ప‌త్రి స‌మీపంలోని గోమ‌తి అపార్ట్‌మెంట్‌లో శ‌ర్మ నివాసం ఉంటున్నారు. బుధ‌వారం ఉద‌యం శ‌ర్మ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు ఆయ‌న‌కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయ‌లేదు. దీంతో అనుమానం వ‌చ్చిన అత‌డు పోలీసులకు ఫోన్ చేశాడు. ప్లాట్‌కు వెళ్లిన పోలీసులు గ‌ది త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టారు. ఎంపీ ఫ్యాన్‌కు వేలాడుతూ క‌నిపించారు. ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటార‌ని అనుమానిస్తున్నారు.

2014లో ఆయ‌న తొలిసారి పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. విదేశాంగ వ్య‌వ‌హారాలకు చెందిన స్టాండింగ్ క‌మిటీలో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు. ఎంపీ రామ్ స్వ‌రూప్ శ‌ర్మ‌కు భార్య‌, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఎంపీ స్వ‌రూప్ శ‌ర్మ గ‌త కొన్నాళ్ల నుంచి తీవ్ర మాన‌సిక‌క్షోభ‌లో ఉన్నారు. ఆరు నెల‌ల నుంచి డిప్రెష‌న్ కు చికిత్స తీసుకుంటున్నారు. ఢిల్లీలో ప్ర‌స్తుతం ఆయ‌న ఒంటరిగా ఉంటున్నారు. ఆయ‌న భార్య చార్‌థామ్ యాత్ర‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎంపీ మ‌ర‌ణంతో నేడు జ‌ర‌గాల్సిన బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశాన్ని ర‌ద్దు చేశారు.Next Story
Share it