బీజేపీ ఎమ్మెల్యే భార్య మిస్సింగ్‌

బీజేపీ ఎమ్మెల్యే భార్య అదృశ్యమైంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఏదో పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతసేపటికి ఇంటికి రాలేదు.

By అంజి  Published on  1 Nov 2023 8:02 AM GMT
BJP MLA wife, missing, Lucknow

బీజేపీ ఎమ్మెల్యే భార్య మిస్సింగ్‌

బీజేపీ ఎమ్మెల్యే భార్య అదృశ్యమైన ఘటన లక్నోలో వెలుగుచూసింది. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో లక్నోలోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లోని లంబువా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సీతారాం వర్మ భార్య ఏదో పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతసేపటికి ఇంటికి రాలేదు. ఆ తర్వాత ఎమ్మెల్యే సీతారాం వర్మ భార్య అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయిందని తేలింది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టి వెంటనే వివిధ బృందాలుగా ఏర్పడి ఆమె కోసం వెతుకుతున్నారు.

అయితే ఇప్పటి వరకు ఎలాంటి వార్త బయటకు రాలేదు. ఈ విషయమై ఎమ్మెల్యే సీతారాం వర్మ కుమారుడు ఘాజీపూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ సమాచారంతో రాజధానిలో కలకలం రేగింది. ఎమ్మెల్యే భార్య ఆచూకీ కోసం లక్నో పోలీసులు అర డజనుకు పైగా బృందాలను ఏర్పాటు చేశారు. నిఘా బృందంతో పాటు సైబర్ సెల్‌ను కూడా అలర్ట్‌ చేశారు. ఎమ్మెల్యే సీతారాం వర్మకు ఘాజీపూర్ సెక్టార్-8లో ఇల్లు ఉంది, అందులో ఆయన భార్య పుష్ప వర్మ (65) కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు.

మంగళవారం ఉదయం 6.00 గంటలకు ఎమ్మెల్యే భార్య పుష్ప ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కొడుకు రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ పంకజ్ కుమార్ తన తండ్రికి సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పుష్ప వర్మ మతిమరుపుతో బాధపడుతున్నారు. ఆమె చికిత్స కూడా పొందుతున్నారు. నిన్న ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇందిరా నగర్‌లోని అరబిందో పార్క్ అవుట్‌పోస్టు సమీపంలో పుష్ప కనిపించిందని డీసీపీ తెలిపారు. సీసీ కెమెరాలు, సోషల్ మీడియా సహాయంతో పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు.

Next Story