కరోనాతో ఎమ్మెల్యే కన్నుమూత

BJP MLA Surendra Singh Jeena passes away I కరోనా మహమ్మారి ఎందరినో బలి తీసుకుంటోంది. సామాన్యుడి నుంచి

By సుభాష్  Published on  12 Nov 2020 8:43 AM IST
కరోనాతో ఎమ్మెల్యే కన్నుమూత

కరోనా మహమ్మారి ఎందరినో బలి తీసుకుంటోంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే రాజకీయ నేతలు ఎందరో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ జీనా కరోనా బారిన పడి ప్రాణాలు వదిలారు. గత కొద్ది రోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్‌ తేలింది. ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక బుధవారం రాత్రి సురేంద్ర సింగ్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు.

కాగా, సరేంద్ర సింగ్‌ 1969, డిసెంబర్‌ 8న అల్మోరా జిల్లాలోని సాదిగావ్‌లో జన్మించారు. 2007లో మొదటిసారిగా బిక్యాసెన్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే సాల్ట్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత కొద్ది రోజుల కింద ఆయన భార్య గుండెపోటుతు మృతి చెందగా, తాజా ఆయన కరోనాతో మృతి చెందడం రాజకీయ నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో సురేంద్ర సింగ్‌ ఎన్నో సేవలందించారని, ఆయన లేని లోటు తీరనిదని పలువరు పేర్కొంటున్నారు.


Next Story