సోనియా గాంధీ విష క‌న్య‌.. బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

BJP MLA calls Sonia Gandhi a ‘visha kanya’. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

By Medi Samrat
Published on : 28 April 2023 3:22 PM IST

సోనియా గాంధీ విష క‌న్య‌.. బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

BJP MLA calls Sonia Gandhi a ‘visha kanya’



కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖ‌ర్గే టంగ్ స్లిప్ అయ్యారు. ప్రధాని మోదీని విష స‌ర్పంతో పోల్చిన విష‌యం తెలిసిందే. ఆ వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ దుమారం రేగింది. అనంత‌రం మల్లికార్జున ఖ‌ర్గే వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగింద‌నుకుంటే.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీని విష క‌న్య‌ అని పిలిచారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీపై బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్ అభ్యంతరకర ప్రకటన చేస్తూ ఆమెను విషకన్యగా పేర్కొన్నారు.

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే చేసిన ప్రకటన తర్వాత కాంగ్రెస్ వైపు నుంచి ప్రతీకార దాడి మొద‌లైంది. ఈ ప్రకటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భ‌గేల్ స్పందిస్తూ.. బసవ‌గౌడ యత్నాల్ ప్రకటనపై ప్రధాని మోదీ, అమిత్ షా ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి. కుల్బర్గిలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీ విషసర్పం లాంటి వారని అన్నారు. అది విషమా.. కాదా.. అని మీరు ఆశ్చర్యపోవచ్చు. మీరు దానితో సంబంధం కలిగి ఉంటే.. చనిపోతారు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


Next Story