బీజేపీ నాలుగో జాబితాలో ఎంపీ అభ్యర్థిగా సినీనటి రాధికా శరత్‌కుమార్
దేశంలో లోక్‌సభ ఎన్నికల నగరా మోగిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 22 March 2024 4:07 PM IST
బీజేపీ నాలుగో జాబితాలో ఎంపీ అభ్యర్థిగా సినీనటి రాధికా శరత్‌కుమార్
దేశంలో లోక్‌సభ ఎన్నికల నగరా మోగిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్‌ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి వరుసగా మూడోసారి అధికారం చేపట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తగిన అన్ని వ్యూహాలను అమలు చేస్తోంది. గెలిచే అభ్యర్థులను ఎంపిక చేస్తూ జాబితాల వారీగా అభ్యర్థుల లిస్ట్‌లను విడుదల చేస్తోంది. తాజాగా బీజేపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థుల నాలుగో జాబితాను రిలీజ్ చేసింది.
ఇప్పటి వరకు బీజేపీ 275 మంది లోక్‌సభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. తాజాగా 15 మంది సభ్యులతో మూడో లిస్ట్‌ను విడుదల చేసింది.దాంతో.. బీజేపీ ఇప్పటి వరకు విడుదల చేసిన జాబితాలు అన్నీ కలిపితే అభ్యర్థుల సంఖ్య 290కి చేరింది. ఇక పోతే నాలుగవ జాబితాలో ప్రముఖ సినీ నటి రాధికా శరత్ కుమార్ బీజేపీ తరఫున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకన్నారు. విరుద్ నగర్ నుంచి సినీనటి రాధిక బరిలో దిగబోతున్నారు. ఇక మరోవైపు చెన్నై నార్త్ నుంచి ఆర్‌సీ పాల్ కనగ్‌రాజ్‌ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.
లోక్‌సభ బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా:
తిరువల్లూరు -వీ బాలగణపతి
చెన్నై నార్త్-ఆర్‌సీ పాల్ కనగరాజ్
తిరువనమలై-ఏ ఆశ్వనాథమన్
నమక్కల్-డా.కేపీ రామలింగం
తిరుప్పర్-ఏపీ మురుగునందం
పొలాచి-వీ వసంతరాజన్
కరూర్-వీవీ సెంథిల్ నాథన్
చిదంబరం-పి.కార్తియాయిని
నాగపట్టినం-ఎస్‌జీఎం రమేశ్
తంజావురు-ఎం.మురుగనందం
శివగంగ-డా.దేవంతన్ యాదవ్
మధురై-రామ శ్రీనివాసన్
విరుదునగర్- రాధికా శరత్ కుమార్
తెంకాశి-బి.జాన్ పాండియన్
పుదుచ్చేరి- ఏ నమశ్శివాయం