కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ ఉల్లంఘన.. సీఎం పై పోలీసులకు ఫిర్యాదు

BJP leader files complaint against Uddhav Thackeray.మ‌హారాష్ట్ర‌లో తీవ్ర రాజ‌కీయ సంక్షోభం నెల‌కొని ఉంది. ఉద్ద‌వ్ థాక్రే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Jun 2022 5:02 AM GMT
కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ ఉల్లంఘన.. సీఎం పై పోలీసులకు ఫిర్యాదు

మ‌హారాష్ట్ర‌లో తీవ్ర రాజ‌కీయ సంక్షోభం నెల‌కొని ఉంది. ఉద్ద‌వ్ థాక్రే ప్ర‌భుత్వం కూలిపోయే స్థితిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సీఎం ఉద్దవ్‌ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. ముఖ్య‌మంత్రి క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని బీజేపీ నేత తేజిందర్‌ పాల్‌ సింగ్ బగ్గా ముంబైలోని బలబార్‌ హిల్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఉద్దవ్‌ థాక్రేకు కరోనా పాజిటివ్‌ సోకిందని సీఎం కార్యాల‌యం బుధ‌వారం ప్ర‌క‌టించింది. అయితే.. రాష్ట్రంలో ఏర్ప‌డిన రాజ‌కీయ అస్థిర‌త నేప‌థ్యంలో రాత్రి పొద్దుపోయిన త‌రువాత సీఎం అధికారిక నివాసం 'వర్ష'ను ఉద్ద‌వ్ థాక్రే ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా శివసేన కార్యకర్తలు ఆయనపై పూలు చల్లారు. మీ వెంట మేమున్నాం అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో క‌రోనా బారిన ప‌డిన వ్య‌క్తి.. ఐసోలేషన్‌లో ఉండకపోవడం, భౌతిక దూరం తదితర కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించారన్నది తజిందర్ పాల్‌సింగ్‌ ఆరోపణ. ఇక కుటుంబంతో సహా 'మాతోశ్రీ'కి చేరుకున్న తర్వాత కూడా ఉద్ద‌వ్ థాక్రే వందల మంది మద్దతుదారులతో భేటీ నిర్వహించినట్లు తజిందర్‌ పాల్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేర‌కు త‌న ఫిర్యాదు కాపీని ట్వీట‌ర్ పోస్ట్ చేశారు.

Next Story
Share it