బీజేపీ జాతీయ కార్యవర్గంలో వారిని తప్పించేశారు
BJP Acts Against Varun Gandhi.జాతీయ నూతన కార్యవర్గాన్ని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ జాతీయ
By M.S.R
జాతీయ నూతన కార్యవర్గాన్ని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ, డాక్టర్ మురళి మనోహర్ జోషి, మాజీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ మరియు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నేషనల్ ఆఫీస్ బేరర్స్‌తో సహా 80 మంది సభ్యులను ఆహ్వానించారు. జాతీయ కార్యనిర్వాహక కమిటీలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 శాశ్వత ఆహ్వానితులను ప్రకటించారు.
ఈ జాబితాలో వరుణ్‌గాంధీ, మేనకాగాంధీలకు చోటు లేకుండాపోయింది. సుల్తాన్‌పూర్ నుంచి లోకసభ ఎంపీగా మేనకగాంధీ, ఫిల్‌భిత్‌ను నుంచి ఆమె కుమారుడు వరుణ్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో వీరు బీజేపీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో రైతులను వాహనంతో తొక్కించిన ఘటనపై ఎంపీ వరుణ్ గాంధీ చాలా ఘాటుగా స్పందించారు. హత్యలతో నిరసనకారుల నోళ్లు మూయించలేరు అని గురువారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. హత్యలతో నిరసనకారుల నోళ్లు మూయించలేరు. అమాయక రైతుల రక్తం కళ్ల చూసిన వారిని బాధ్యులను చేయాలి. ఈ క్రూరత్వం, అహంకారానికి సంబంధించిన సందేశం రైతుల మెదళ్లలోకి వెళ్లక ముందే న్యాయం జరగాలి అని ట్వీట్ చేశారు.