రికార్డుల రారాజు బిర్యానీ.. భారత్‌లో నిమిషానికి 127 ఆర్డర్లు.. స్విగ్గీ డేటా

Biryani, Masala dosa and samosa top swiggy order charts in 2022. భారతీయులు.. బిర్యానీ అంటే చాలు లొట్టలేసుకుంటూ తినేస్తారు. బిర్యానీ తినని వారు చాలా

By అంజి  Published on  15 Dec 2022 2:01 PM GMT
రికార్డుల రారాజు బిర్యానీ.. భారత్‌లో నిమిషానికి 127 ఆర్డర్లు.. స్విగ్గీ డేటా

భారతీయులు.. బిర్యానీ అంటే చాలు లొట్టలేసుకుంటూ తినేస్తారు. బిర్యానీ తినని వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఈ విషయాన్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ తాజా గణాంకాలే చెబుతున్నాయి. స్విగ్గీ విడుదల చేసిన డేటా ప్రకారం.. బిర్యానీ కొత్త రికార్డులను నెలకొల్పుతూనే ఉంది. భారతదేశంలో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన ఆహారంగా బిర్యానీ నిలిచింది. స్విగ్గీలో నిమిషానికి దాదాపు 127 బిర్యానీలు ఆర్డర్ చేయబడుతున్నాయి. అంటే సెకనుకు దాదాపు 2.28 బిర్యానీలు ఆర్డర్‌ అవుతున్నాయి.

స్విగ్గీ అధ్యయనం ప్రకారం.. రెండవ అత్యధికంగా ఆర్డర్ చేయబడిన వంటకం మసాలా దోస్, తరువాత సమోసాలు ఉన్నాయి. సుషీ, మెక్సికన్ బౌల్స్, కొరియన్ స్పైసీ రామెన్, ఇటాలియన్ పాస్తా ఆర్డర్‌లతో కొత్త ఫ్లేవర్ ఆహారాల ఆర్డర్లు పెరిగాయి. ఈ ఏడాది పాప్‌కార్న్ కోసం 22 లక్షల ఆర్డర్‌లు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం రాత్రి 10 గంటలు దాటిన తర్వాత వచ్చిన ఆర్డర్లే. ఈ సంవత్సరం కూడా చాలా మంది తమ ఆల్-టైమ్ ఫేవరెట్ గులాబ్ జామూన్‌కి అతుక్కుపోయారని కూడా డేటా చూపించింది. ఇది 27 లక్షల సార్లు ఆర్డర్ చేసిన టాప్ డెజర్ట్. 16 లక్షల ఆర్డర్‌లతో రస్మలై, 10 లక్షలకు పైగా చోకో లావా కేక్‌ల ఆర్డర్లు వచ్చాయి.

స్విగ్గీ వన్‌ సేవింగ్స్

అలాగే, 85% స్విగ్గీ వన్‌ వినియోగదారులు.. స్విగ్గీ నుండి ఒకటి కంటే ఎక్కువ సేవలను ఉపయోగించారు. ఉచిత డెలివరీలతో సభ్యులు అత్యధికంగా ఆదా చేసుకున్నారు. భారతదేశం అంతటా సభ్యులు పది కోట్ల విలువైన ఉచిత డెలివరీలను ఆస్వాదించారు. స్విగ్గీ వన్‌- స్విగ్గీ మెంబర్‌షిప్ ప్రోడక్ట్‌తో అత్యధికంగా ఆదా చేసిన అగ్ర నగరంగా బెంగళూరు నిలిచింది. బెంగుళూరులోని కస్లమర్లు అత్యధిక ప్రయోజనాలను పొందడం ద్వారా రూ. 100 కోట్లకు పైగా ఆదా చేశారు. ముంబై, హైదరాబాద్, ఢిల్లీలో ఉన్నవారు కూడా దీనిని అనుసరించారు.

స్విగ్గీకి చెందిన 35 లక్షల మంది కస్టమర్లు ఈ ఏడాది రూ.53 కోట్ల వరకు డెలివరీ పార్టనర్లకు టిప్‌ ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

Next Story