భారత్‌ పర్యటనలో బిల్‌ గేట్స్.. ప్రధాని మోదీతో సమావేశం

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రస్తుతం ఇండియా టూర్‌లో ఉన్నారు.

By Srikanth Gundamalla
Published on : 1 March 2024 3:31 AM

bill gates, india tour,  prime minister modi,

భారత్‌ పర్యటనలో బిల్‌ గేట్స్.. ప్రధాని మోదీతో సమావేశం 

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రస్తుతం ఇండియా టూర్‌లో ఉన్నారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. మోదీతో సమావేశం తర్వాత బిల్‌ గేట్స్‌ ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ప్రధాని మోదీతో చర్చించిన పలు విషయాల గురించి వెల్లడించారు. ఈ మేరకు పోస్టు పెట్టిన బిల్‌ గేట్స్.. మోదీతో సమావేశం స్ఫూర్తివంతమని చెప్పారు. అనే అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయన్నారు బిల్‌ గేట్స్.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, వ్యవసాయంలో ఆవిష్కరణలు, ఆరోగ్యం మరియు వాతావరణ అనుకూలత మరియు భారతదేశం నుండి ప్రపంచానికి పాఠాలు నేర్చుకోవడం వంటి ఇతర విషయాల గురించి ప్రధానితో మాట్లాడినట్లు గేట్స్ తెలిపారు. ఇక బిల్‌ గేట్స్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టిన తర్వాత.. ప్రధాని మోదీ కూడా ఒక ట్వీట్ చేశారు. బిల్‌ గేట్స్‌తో సమావేశం అద్భుతంగా సాగిందని వ్యాఖ్యానించారు. భూమి పరిరక్షణ, సామాన్యులకు సాధికారత వంటి అనేక అంశాలపై చర్చించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతకుముందు.. బిల్‌ గేట్స్‌ విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌, మన్‌సుఖ్‌ మాండవీతో పాటు ఇతరుతో కూడా సమావేశం అయ్యారు. ఈ మేరకు వారితో సమావేశాల గురించి కూడా బిల్‌ గేట్స్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.

కాగా.. బిల్‌గేట్స్‌ మంగళవారం రాత్రి భారత్‌కు వచ్చారు. బుధవారం తొలుత ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కలిశారు. ఆ తర్వాత రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి భువనేశ్వర్‌లోని మురికి వాడలను సందర్శించారు. అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని కొన్ని మహిళా స్వయం సహాయక బృందాలతో కూడా గేట్స్ సమావేశమయ్యారు. గుజరాత్‌లోని జమానగర్‌లో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లలో కూడా గేట్స్ పాల్గొంటారని సమాచారం.



Next Story