హనుమంతుని విగ్రహం ముందు.. బికినీలో బాడీబిల్డర్ల పోజులు

మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో మహిళా బాడీబిల్డర్లు హనుమంతుడి విగ్రహం ముందు బిక్నీలు ధరించి ప్రదర్శన ఇచ్చారు.

By అంజి  Published on  7 March 2023 6:38 AM GMT
Hanuman idol, bodybuilders

మహిళా బాడీబిల్డర్లు హనుమంతుడి విగ్రహం ముందు బిక్నీలు ధరించి ప్రదర్శన

మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ డ్రెస్‌కోడ్‌పై వివాదం చెలరేగింది. మహిళా బాడీబిల్డర్లు హనుమంతుడి విగ్రహం ముందు బిక్నీలు ధరించి ప్రదర్శన ఇచ్చారు. ఈ ఘటన హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నిర్వాహకులకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్‌ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ హాజరైన ఈ కార్యక్రమాన్ని.. రత్లాం మేయర్ (బీజేపీ) ప్రహ్లాద్ పటేల్ నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌కు 'ముఖ్యమంత్రి బాడీ-బిల్డింగ్ కాంపిటీషన్' అని పేరు పెట్టారు.

ఇది హనుమంతుడిని అవమానించడమేనని బీజేపీని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి హనుమాన్‌ చాలీసా పఠించారు. కొందరు స్థానిక బిజెపి నాయకులు కూడా నిరసనలో పాల్గొని చాలీసా పఠించారు. అయితే మహిళా పోటీదారులు తమ డ్రెస్‌కోడ్‌లో మాత్రమే వేదికపై ప్రదర్శన ఇచ్చారని నిర్వాహక కమిటీ పేర్కొంది.

రాష్ట్ర కాంగ్రెస్ మీడియా ఇన్‌ఛార్జ్ కెకె మిశ్రా మాట్లాడుతూ.. ''హనుమాన్ విగ్రహం ముందు నగ్న ప్రదర్శన ప్రదర్శించబడింది. ఇది బీజేపీ నాయకుల సమక్షంలో జరిగింది'' అని అన్నారు. ''బీజేపీ తనను తాను 'రామభక్త్' పార్టీగా పిలుస్తుంది. మరోవైపు ఆ పార్టీ నాయకులు హనుమంతుడిని అవమానిస్తున్నారు. హిందూ ఆరాధ్య దైవాన్ని అవమానించినందుకు బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలి'' అని ఆయన అన్నారు.

Next Story