అతి తెలివైన భర్త.. కిడ్నాప్‌ కట్టు కథతో భార్యను బురిడీ కొట్టించాలనుకున్నాడు.. కానీ

Bihar youth fakes own kidnapping to repay debt, asks wife for ransom. ఒక విచిత్రమైన సంఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. అప్పు తీర్చడం కోసం ఓ వ్యక్తి పెద్ద నాటకమే ఆడాడు.

By M.S.R
Published on : 29 July 2022 5:30 PM IST

అతి తెలివైన భర్త.. కిడ్నాప్‌ కట్టు కథతో భార్యను బురిడీ కొట్టించాలనుకున్నాడు.. కానీ

ఒక విచిత్రమైన సంఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. అప్పు తీర్చడం కోసం ఓ వ్యక్తి పెద్ద నాటకమే ఆడాడు. బెగుసరాయ్‌లో ఓ వ్యక్తి తన అప్పు తీర్చడానికి కిడ్నాప్‌ కట్టు కథ అల్లాడు. రూ. 4 లక్షలకు పైగా అప్పులు చెల్లించిన సదరు వ్యక్తి.. తన అప్పును తిరిగి చెల్లించడానికి అతని భార్య దగ్గర కిడ్నాప్ నాటకం ఆడాడు. అతడి భార్య ఆ డబ్బులు తీసుకుని వస్తుందని అనుకున్నాడు. కానీ కథ వేరేలా సాగింది. దులార్‌పూర్ గ్రామానికి చెందిన దీపక్ కుమార్ బచ్వారా తన ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.

తాను కిడ్నాప్ అయ్యానని.. కిడ్నాపర్లు కోరిన డబ్బును తీసుకుని రావాలని భార్యను కోరాడు. పలు వివరాలతో భార్యకు మెసేజ్ చేశాడు. పొలం అమ్మి డబ్బులు సమకూర్చుకోవచ్చని కూడా సూచించాడు. అయితే అతని భార్య సోనీ కుమారి అతని కిడ్నాప్‌పై బచ్వారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించి 24 గంటల్లో వైశాలి జిల్లా మహువా గ్రామంలో దీపక్‌ను గుర్తించారు. పోలీసులు ఎందుకిదంతా చేసావ్ అని అడగగా.. తన అప్పుల గురించి బయటపెట్టాడు. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

Next Story