జీన్స్, టీషర్ట్‌లు ధరించొద్దని బీహార్ విద్యాశాఖ కీలక ఆర్డర్స్

బీహార్‌ విద్యాశాఖ తమ ఉద్యోగుల కోసం కీలక ఆదేశాలను జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  29 Jun 2023 9:02 AM GMT
Bihar, Education Dept, Ban, Jeans, T-shirt, Working Places,

జీన్స్, టీషర్ట్‌లు ధరించొద్దని బీహార్ విద్యాశాఖ కీలక ఉత్తర్వులు

బీహార్‌ విద్యాశాఖ తమ ఉద్యోగుల కోసం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఇక నుంచి కేవలం ఫార్మల్ దుస్తులనే ధరించి ఆఫీసులకు రావాలని కోరింది. జీన్స్‌, టీషర్ట్స్‌ వంటి క్యాజువల్స్‌ వేసుకుని కార్యాలయాలకు రావొద్దని సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లుగా దుస్తులు ధరించి వస్తున్నారని.. దీనివల్ల ఆఫీస్‌ కల్చర్‌ దెబ్బతింటోందని విద్యాశాఖ డైరెక్టర్‌ ఉతర్వుల్లో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే టీషర్ట్‌, జీన్స్‌ వంటి క్యాజువల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. తాజా ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా తెలిపారు. మరోవైపు ఈ ఆదేశాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్‌ ఇంతవరకు స్పందించలేదు. ఈ రకమైన ఉత్తర్వులు బీహార్‌లో ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2019లోనూ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు జీన్స్, టీషర్ట్స్‌ ధరించి రావొద్దని బీహార్ ప్రభుత్వం నిషేధం విధించింది. సింపుల్‌గా, లైట్‌ కలర్‌లో ఉండే దుస్తులు మాత్రమే సచివాలయ ఉద్యోగులు వేసుకుని రావాలని తెలిపింది. కాగా.. బీహార్‌ విద్యాశాఖ తాజా ఆర్డర్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్‌ విద్యాశాఖ తమ ఉద్యోగుల కోసం కీలక ఆదేశాలను జారీ చేసింది.

Next Story